India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు..వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా ఉమ్మడి కడపలోని 10 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 2, వైసీపీకి 4, నాలుగు టఫ్ ఫైట్ ఉంటాయని, కేకే సంస్థ కూటమి-5, వైసీపీ-3 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఇంతకీ మీ అంచనా ఏంటి..?

ప్రధాన పార్టీలు జిల్లాలో తమకే మెజారిటీ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదులయ్యాయి. చాలా సర్వేలలో జిల్లాలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాయి. 9 స్థానాల్లో 4 లేదా 5 స్థానాలను వైసీపీ, కూటమి పంచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. విజయనగరం ఎంపీ సీటు కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందట. దీంతో ఉత్కంఠ నెలకొంది.

నెల్లూర్ రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ చుట్టూ భద్రతా ఏర్పాట్లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, బారికేడ్ల ఏర్పాట్లు, కనుపర్తిపాడు ZP హైస్కూల్ లో పార్టీ అభ్యర్థులు, నేతల పార్కింగ్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా మూడంచెల భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు

రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు శనివారం వెల్లడించడంతో ఉమ్మడి తూ.గో. జిల్లాలో గెలుపు అవకాశాలపై ఒక అంచనా ఏర్పడిందని చర్చ సాగుతోంది. 19 అసెంబ్లీ స్థానాలకు గానూ చాణక్య స్ట్రాటజీస్, పోస్ట్ పోల్, కేకే తదితర సంస్థలు కూటమే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. తుది ఫలితాలకు నేడు, రేపు మాత్రమే మిగిలి ఉండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
– సర్వే ఫలితాలపై మీ కామెంట్..?

ప్రధాన పార్టీలు విశాఖ జిల్లాలో తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయంటూ ఆ పార్టీలలోని ముఖ్య నాయకులు మీడియా ముఖంగా చెప్పారు. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదులయ్యాయి. ఇందులో జిల్లాలో చాలా వరకు టీడీపీకే మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వస్తాయని, కొన్నిచోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. విశాఖ ఎంపీ సీటు టీడీపీ, అనకాపల్లిలో బీజేపీ, అరకులో వైసీపీ గెలుస్తాయని తెలిపాయి. మరి ఈ సర్వేలపై మీ కామెంట్?

తిరుపతి జిల్లాలో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రౌండ్ల వివరాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు-21రౌండ్లు, సూళ్లూరుపేట-22రౌండ్లు, వెంకటగిరి-22రౌండ్లు, తిరుపతి-20 రౌండ్లు, శ్రీకాళహస్తి-21రౌండ్లు, చంద్రగిరి-20రౌండ్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 2,231మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5గంటల్లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MBA/MCA నాలుగవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లకు గాను NDA కూటమి 8-9 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లకు గాను NDA కూటమి 9-10 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.