India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MBA/MCA నాలుగవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 15 నుంచి 14 స్థానాల్లో, వైసీపీ 2-3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి నెల్లూరులో ఎన్డీఏ కూటమికి 5-7, వైసీపీకి 3-5 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు నెల్లూరు ఎంపీ స్థానంలో టీడీపీ గెలుస్తుందని, తిరుపతిలో వైసీపీ, కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొనగా.. జూన్ 4న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్డీఏ కూటమికి 7-9 సీట్లు, వైసీపీకి 5-7 ఎమ్మెల్యే సీట్లు రానున్నాయి. మరోపక్క చాణక్య ఎక్స్ సర్వే ప్రకారం.. కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలను వైసీపీ (బీవై రామయ్య, పోచ బ్రహ్మానంద రెడ్డి) కైవసం చేసుకోనుందని అంచనా వేసింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 2-4 స్థానాల్లో, కూటమికి 8-10 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 15 నుంచి 17 స్థానాల్లో, వైసీపీ 2- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ స్థానంలో టీడీపీ, రాజమండ్రి నుంచి బీజేపీ, కాకినాడ నుంచి జనసేన గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 11 నుంచి 12 స్థానాల్లో, వైసీపీ 3- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ, నరసాపురం నుంచి బీజేపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం అనంతపురం జిల్లాలో ఎన్డీఏ కూటమికి 9-10, వైసీపీకి 4-5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల్లో టీడీపీనే గెలవనుందని చాణక్య ఎక్స్ పేర్కొంది.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 2-3, ఎన్డీఏ కూటమికి 7-8 వస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ గెలువనుందని చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి చిత్తూరులో వైసీపీకి 6-7, ఎన్డీఏ కూటమికి 7-8 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు చిత్తూరు, తిరుపతి ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొనగా.. జూన్ 4న తుదిఫలితాలు వెల్లడికానున్నాయి.
Sorry, no posts matched your criteria.