India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 13నుంచి 14 స్థానాల్లో, వైసీపీ 2-3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని మచిలీ పట్నం పార్లమెంట్ స్థానంలో జనసేన, విజయవాడ నుంచి టీడీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.

ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 4-5 స్థానాల్లో, కూటమికి 5-6 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంట్ స్థానంలో వైసీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం విజయనగరంలో వైసీపీకి 4-5, ఎన్డీఏ కూటమికి 4-5 వస్తాయని అంచనా వేసింది. అటు అరకు ఎంపీ స్థానంలో వైసీపీ (తనూజ) , విజయనగరం టీడీపీ( కలిశెట్టి అప్పలనాయుడు) గెలుస్తారని చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం విశాఖలో వైసీపీకి 2-4, ఎన్డీఏ కూటమికి 11-13 వస్తాయని అంచనా వేసింది. అటు అరకు ఎంపీ స్థానంలో వైసీపీ (తనూజ) , విశాఖలో టీడీపీ( శ్రీ భరత్), అనకాపల్లిలో టఫ్ ఫైట్ ఉండనుండగా బీజేపీకి ఛాన్స్ ఉంటుందని చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. కాగా ఉమ్మడి తూ.గో.లోని 19 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 15, వైసీపీకి 3 వస్తాయని, కేకేసంస్థ టీడీపీ- 9, జనసేన- 6 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఉమ్మడి జిల్లాలో కూటమికి 12 వస్తాయని, కేకే సంస్థ టీడీపీ-9, జనసేన-6 గెలుస్తాయని ఫలితాలు విడుదల చేశాయి. కాగా తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గానూ కూటమికి 13, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుండగా.. ఒక చోట టఫ్ ఫైట్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ COMMENT.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గానూ కూటమికి 13, వైసీపీ 3 చోట్ల విజయం సాధించనుండగా.. ఒక చోట టఫ్ ఫైట్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ COMMENT.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరికి సంబంధించి KK సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు గానూ టీడీపీ- 09, జనసేన- 6 గెలుస్తాయని తెలిపింది. వైసీపీ ఏ ఒక్కచోటా గెలవదని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి
– మీ కామెంట్..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి KK సర్వే ఫలితాలు వెల్లడించింది. మొత్తం 19 స్థానాలకు గాను టీడీపీ-12, జనసేన- 5, బీజేపీ- 1, వైసీపీ- 1 చోట గెలవనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
– మీ కామెంట్ ఏంటి..?
Sorry, no posts matched your criteria.