India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎన్నికల సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకుగాను కూటమికి 7, వైసీపీకి 2 విజయం, 1 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండనుందని వెల్లడించింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 సీట్లలో వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని కేకే సర్వే పేర్కొంది. టీడీపీకి 13 సీట్లు, జనసేనకి 1సీటు, బీజేపీకి 2 సీట్లు వస్తాయని చెప్పింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ గెలవబోతున్నట్లు సర్వే అంచనా వేస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను కేకే సర్వే వెల్లడించింది. 14 సీట్లలో వైసీపీ కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించబోతుందని కేకే సర్వే వెల్లడించింది. టీడీపీకి 11 సీట్లు వస్తాయని చెప్పింది. కాగా ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 6 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవనున్నారని తేల్చి చెప్పింది. మరో రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. కాగా ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. మొత్తం 19 స్థానాలకు గాను కూటమికి 15, వైసీపీ 3 చోట్ల విజయం సాధించనుండగా..ఒకచోట టఫ్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. – మీ కామెంట్ ఏంటి..?

ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకుగాను కూటమి 2, వైసీపీ 4 చోట్ల విజయం సాధించనుండగా.. 4 చోట్ల టఫ్ ఫైట్ ఉండనుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. అలాగే కూటమి 6, వైసీపీ 3, మరోచోట టఫ్ ఫైట్ ఉంటుందని కే.కే సర్వే తెలిపింది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనిపై మీ కామెంట్.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కేకే సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను కూటమికి 8, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి

ఉమ్మడి విశాఖలో టీడీపీ -11, వైసీపీ-2, టఫ్ ఫైట్ రెండు చోట్ల ఉంటుందని చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. వైసీపీ-1, టీడీపీ-9, జనసేన-4, బీజేపీ-1 గెలుస్తాయని కేకే సర్వే తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని తెలిపింది. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుస్తారని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. మొత్తం 15 స్థానాలకు గాను కూటమికి 12, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుండగా..ఒకచోట టఫ్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
– మీ కామెంట్ ఏంటి..?

ఉమ్మడి గుంటూరులో జిల్లాలోని 17 సీట్లలో వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని కేకే సర్వే పేర్కొంది. టీడీపీకి 16 సీట్లు వస్తాయని చెప్పింది. జనసేనకు 1 సీటు వస్తుందని పేర్కొంది. మంత్రులుగా చేస్తున్న రజిని, అంబటి రాంబాబు గెలుపు అవకాశాలు తక్కువని స్పష్టం చేసింది. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.
Sorry, no posts matched your criteria.