Andhra Pradesh

News June 1, 2024

మంగళగిరిలో గెలుపు లోకేశ్‌దే: ఆరా

image

మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తారని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. మరోవైపు, గుంటూరు వెస్ట్‌లో మంత్రి విడదల రజిని స్వల్ప తేడాతో ఓడిపోతారని పేర్కొంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలిలో విజయం సాధిస్తారని సర్వే వివరించింది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గట్టి పోటీ ఎదుర్కొంటారని ఆరా మస్తాన్ సర్వే స్పష్టం చేసింది.

News June 1, 2024

ఆరా సర్వే..గుడివాడ అమర్నాథ్‌ ఓటమి

image

జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ప్రకారం గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని తెలిపింది. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుస్తారని అంచనా వేసింది.

News June 1, 2024

ఆదిమూలపు సురేశ్ బాబు ఓడిపోతారు: ఆరా

image

కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేశ్ ఓడిపోతున్నారని ఆరా సర్వే అంచనా వేసింది. పరోక్షంగా డొలా బాల వీరాంజనేయస్వామి గెలుస్తారని చెప్పింది. అలాగే సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

News June 1, 2024

కడపలో షర్మిలకు డిపాజిట్ రాదు: ఆరా

image

కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలకు డిపాజిట్ కూడా రాదని ఆరా సర్వే అంచనా వేసింది. పరోక్షంగా వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తారని చెప్పింది. అలాగే కడప నుంచి అంజాద్ బాషా స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..?

News June 1, 2024

విజయవాడ పశ్చిమలో సుజనాదే గెలుపు: ఆరా

image

విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. ఇక్కడ ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారని తెలిపింది. గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు, పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి రమేశ్ గట్టి పోటీ ఎదుర్కొంటారని వివరించింది. కైకలూరులో కామినేని శ్రీనివాస్ గెలుస్తారని సర్వే చెప్పింది.

News June 1, 2024

బాలకృష్ణ భారీ మెజార్టీ.. ఉషశ్రీ, గుమ్మనూరు ఓటమి: ఆరా మస్తాన్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వేలో ఫలితాన్ని ప్రకటించారు. అలాగే పెనుకొండ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఓడిపోతారని వెల్లడించింది.

News June 1, 2024

చీపురుపల్లి నుంచి బొత్స ఘన విజయం: ఆరా సర్వే

image

జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపరుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి రాజన్న దొర ఘన విజయం సాధించబొతున్నట్లు తెలిపింది.

News June 1, 2024

భారీ మెజార్టీతో పెద్దిరెడ్డి గెలుపు: ఆరా

image

బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడి నుంచి గెలుస్తారని చెప్పకనే చెప్పింది. అలాగే పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి భారీ విజయం సాధిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..?

News June 1, 2024

ఆరా మస్తాన్ సర్వే.. సీదరి ఓటమి!

image

సీదిరి అప్పలరాజు పలాసలో ఓడిపోనున్నారని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. అటు ధర్మాన ప్రసాద్ శ్రీకాకుళంలో గట్టి పోటీ ఎదుర్కోనున్నారని తెలిపింది. తమ్మినేని సీతారాం అముదాలవలసలో కొద్ది ఓట్ల తేడాతో ఓటమికి అవకాశం ఉందని పేర్కొంది.

News June 1, 2024

కాకాణి గెలుపు.. విజయసాయిరెడ్డి ఓటమి: ఆరా

image

సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించింది. అదేవిధంగా వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన వి.విజయసాయిరెడ్డి ఓడిపోతారని అంచనా వేసింది.