India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈసారి ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి ఖాయమని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో ఆమె స్పల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. తాజా ఎన్నికల్లో పరాజయం తప్పదని ఆరా చెప్పడంతో.. పరోక్షంగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాను అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మవరం పట్టణం ఎల్సీకే పురానికి చెందిన గొల్ల నారాయణ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందిమల్ల కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై చెన్నెకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉమ్మడి కడప జిల్లాలో పలువురు ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరెవరంటే..
* బిజివేముల వీరారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎల్ రవీంద్రనాథ్ రెడ్డి (6 సార్లు)
* నంద్యాల వరద రాజుల రెడ్డి(5 సార్లు)
* గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ప్రభావతమ్మ, శెట్టిపల్లి రఘురామిరెడ్డి (4 సార్లు).
– వీరిలో ప్రస్తుతం గడికోట, కొరముట్ల, శెట్టిపల్లి, వరదరాజుల రెడ్డి బరిలో ఉన్నారు.

ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. నౌపడ-పూండీ మెయిన్ లైన్‌లో వంతెన పనులు నేపథ్యంలో 3వ తేదీన పలాస-విశాఖ(07470)ప్యాసెంజర్, విశాఖ-గునుపూర్ (08522) ప్యాసెంజర్, విశాఖ- బరంపురం(18526), 4వ తేదీన బరంపురం-విశాఖపట్నం(18525) ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.స్యాందీప్ పేర్కొన్నారు.

ఈ నెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు కొత్త నిబంధన విధించారు. ఏజెంట్లకు ఎన్నడూ లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే.. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాలో ఎన్నికల అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఆరు వేల మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. జూన్ 4న జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఏజెంట్లుగా వెళ్లే వారికి ఐడి కార్డు లేకుంటే అనుమతించమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల నివాసులందరికి నోటీసులు అందించామని వెల్లడించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు, ఫొటోలు పోస్టు చేస్తే ఆ గ్రూప్ అడ్మిన్స్ వారే పూర్తి భాద్యత వహించాలని పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణరావు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి జీ.సృజన ధన్యవాదాలు తెలిపారు. 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేలా జిల్లా ప్రజలు సహకరించి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమాచారం, ఫిర్యాదుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305 నంబరుకు సంప్రదించాలని పేర్కొన్నారు.

పరిగి మండలం ధనాపురం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్రం హోసూరు చెందిన వారీగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.