India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను వీసీ పీవీజీడీ.ప్రసాద్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో అభినందించారు. బీబీఏ విద్యార్థిని కే.రమ్య యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా కళాశాల విద్యార్థులు కే. రమ్య, టీ.ఊర్మిల విజయనగరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వీరిని అభినందించారు.

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన తెలిపారు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో రౌండ్లు అధికంగా ఉన్నాయని, అందువల్ల ఫలితం వెల్లడి ఆలస్యమవుతుందని అన్నారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు అనంతరం EVMలు లెక్కిస్తామని, తుది ఫలితం సాయంత్రం 5:30 గంటలకు విడుదలవుతుందని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా 7వ విడత పోలింగ్ ఇవాళ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ పై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కోసం నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా మరో మూడు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) 5, 6 ఇన్‌స్టంట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 4న పరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. 4న ఆయా పరీక్షా కేంద్రాలలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగింది. ఇప్పటిదాకా హిందూపురం పరిధిలో 1469మంది రైతులకు 1065.10 క్వింటాళ్లు, మడకశిరలో 799 మందికి 696.80, పెనుకొండలో 949 మందికి 940.30, కదిరిలో 3512 మందికి 2751.30, ధర్మవరంలో 1453 మందికి 1312.30 క్వింటాళ్లు పంపిణీ చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు.

నెల్లూర్ రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ చుట్టూ భద్రతా ఏర్పాట్లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, బారికేడ్ల ఏర్పాట్లు, కనుపర్తిపాడు ZP హైస్కూల్ లో పార్టీ అభ్యర్థులు, నేతల పార్కింగ్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా మూడంచెల భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు

ఏపీలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు పదిమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పర్యవేక్షణ అధికారిగా K.V. మోహన్ రావును నియమించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు ఐపిఎస్ ఆఫీసర్ల నియామకం చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో కొత్తచెరువు వైసీపీ మండల కన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి మృతిచెందిన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన గల రామాలయం వద్ద బైక్‌లో వెళుతున్న ఆయనను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

కడప రిమ్స్‌లో శనివారం అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. వెంకటమ్మ కడుపు నొప్పితో రిమ్స్‌లో అడ్మిట్ అయింది. వైద్యులు పరీక్షించి అది అండాశయ క్యాన్సర్ అని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని వివరించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు అమానుల్లా, జనరల్ సర్జన్ పుష్పలత, మత్తుమందు వైద్యుడు శ్రీనివాస్, స్టాఫ్ నర్సు శివకృష్ణ సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు.

2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గత నెల 13న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై బేతంచెర్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును బుగ్గన ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానం పరిశీలనలో ఉందని, త్వరలోనే విచారణకు వస్తుందని బాధితుడు పీఎన్ బాబు తెలిపారు.
Sorry, no posts matched your criteria.