India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రామాపురం మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్‌లో చిత్తూరు నుంచి నంద్యాలకు వెళుతున్న మద్యం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే పది కేసుల మద్యం స్థానికులు తీసుకెళ్లారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం లోడులో ప్లాస్టిక్ బాటిళ్లు కావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని లారీ నిర్వాహకులు తెలిపారు.

విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని కోరారు. ఇతర కారణాల వల్ల ప్రజల చనిపోతున్నారని అధికారులు అనడం సరికాదని హితవు పలికారు.

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో శనివారం ఈదురు గాలులకు ఓ చెట్టు విరిగి ఆటోపై పడింది. గ్రామానికి చెందిన సూరాడ బుజ్జి అనే వ్యక్తి తన ఆటోను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పెద్ద వృక్షం విరిగి ఆ ఆటోపై పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బుజ్జి లబోదిబోమంటున్నాడు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. జిల్లాలో అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, విజయనగరంలో 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శృంగవరపుకోట మండలంలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బైక్ ఢీకొంది. ఘటనలో సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన అరిషిత్ (21) మృతి చెందగా, శరత్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. శరత్ కుమార్ రెడ్డిని నాయుడుపేట పభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7: 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ , రేకులకుంట వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, టెలిఫోన్08554 225533 ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు.

శ్రీశైల మహా క్షేత్రంలోని టోల్‌గేట్ , నందీశ్వర డార్మెటరీ వద్ద ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి సరిహద్దులలో పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఫారెస్ట్ ల్యాండ్‌ను ఆక్రమించకుండా ఉండడం కోసం ఈ పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజర్ నరసింహులు తెలిపారు.

చీమకుర్తి మండలం పడమటి నాయుడుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఐజాక్ (12) తన తండ్రి దగ్గర బైకు తీసుకొని స్నేహితులతో అధిక స్పీడుతో నడపగా, కంట్రోల్ తప్పి కరెంటు పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఐజాక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు చందు, ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చీమకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

పెనుగంచిప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరగా, లారీ డ్రైవర్ అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వచ్చినట్లు సమాచారం. జగ్గయ్యపేటలో ఈ ఇద్దరు మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.