Andhra Pradesh

News June 1, 2024

చింతకొమ్మదిన్నె: అన్నను కత్తితో పొడిచిన తమ్ముడు

image

చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అక్బర్ (40) అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేయించుకుంటున్న సమయంలో తమ్ముడు భాషాఖాన్ (38)కి అన్నకి స్థలం విషయంలో గొడవ జరిగింది. దీంతో అన్నను తమ్ముడు కత్తితో పొడివగా, తప్పించుకొనే క్రమంలో చేతికి కూడా గాయమైంది. దీంతో కుటుంబీకులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.

News June 1, 2024

నేడు విజయనగరం జిల్లా అవతరణ దినోత్సవం

image

ఉమ్మడి విజయనగరం జిల్లా 1 జూన్ 1979 న అవతరించింది. తొలత విశాఖ జిల్లా నుంచి విజయనగరం, గజపతినగరం, S.KOTA , భోగాపురం తాలూకాలతో…శ్రీకాకుళంలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లితో కలిసి 9 జిల్లాలు ఏర్పడ్డాయి. 1979లో విజయనగరం, S. KOTA, బొబ్బిలి విభజనతో నెల్లిమర్ల , వియ్యంపేట, బాడంగి మూడు తాలూకాలను జోడించారు.1985 లో తాలూకాలు, ఫిర్కాస్ స్థానంలో 34 రెవెన్యూ మండలాలను భర్తీ చేశారు.

News June 1, 2024

దాచేపల్లి ఉపాధ్యాయుడిని సన్మానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం

image

దాచేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్ వలిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం సన్మానించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షేక్ మస్తాన్ వలీ గుంటూరులో జరిగిన సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా మస్తాన్ వలి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News June 1, 2024

గుమ్మలక్ష్మీపురం: లారీని ఢీకొన్న కారు

image

భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ శనివారం ఉదయం గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం కారులో వెళ్తుండగా కోనగూడ మలుపు వద్ద కారు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. గమనించిన స్థానికులు ఆయన్ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతడు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

News June 1, 2024

శ్రీశైలం: CM జగన్‌ను కలిసిన శిల్పా

image

విదేశీ పర్యటన అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం తెల్లవారుజామున శ్రీశైలం నియోజకవర్గ MLA శిల్పా చక్రపాణి రెడ్డి కలిశారు. CM జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శిల్పా స్వాగతం పలికారు. మరికొంతమంది ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు CMను కలిశారు.

News June 1, 2024

పెనుగొండలో ఉరి వేసుకొని మహిళ సూసైడ్

image

పెనుగొండలో ఉరి వేసుకుని శనివారం గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద కోడిపల్లి సమీపంలోని ప్రధాన రహదారికి 300 మీటర్ల దూరంలో పంట పొలాల్లో వేప చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మహళను ఎవరైనా గుర్తిస్తే పెనుకొండ సీఐ ,9440796841 ,రొద్దం ఎస్ఐ 9440901902 నంబర్‌లకు ఫోన్ చేయాలన్నారు.

News June 1, 2024

నరసన్నపేట: టిప్పర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

image

నరసన్నపేట మండలం లుకులాం-కొమనాపల్లి రహదారి మార్గంలో ఉర్లాం సమీపంలో శుక్రవారం మట్టిని తరలిస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రహదారిపై ఎటువంటి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనంలో ఉన్న డ్రైవర్ క్లీనర్‌తో పాటు వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారిలో వాహనాల రద్దీ తగ్గడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు.

News June 1, 2024

కడప: రూ.1.50 కోట్లు స్వాధీనం

image

ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి నుంచి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతకొమ్మదిన్నె మం, జయరాజ్ గార్డెన్స్ వద్ద చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన తిరుమలయ్య అనే బంగారు వ్యాపారి ఈ నగదును చెన్సైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. బిల్లులు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించారు.

News June 1, 2024

తూ.గో: విద్యుత్ కోతలతో ఆక్వా రైతుల గగ్గోలు

image

అప్రకటిత విద్యుత్‌ కోతలు ఉమ్మడి తూ.గో జిల్లాలోని రొయ్యల రైతులకు నష్టాలను మిగుల్చుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అదనపు భారం పడుతోంది. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూ.గో జిల్లాల పరిధిలో 75వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ ఏడాది లాభాల పంట పండిస్తుందనే ఆశతో మార్చిలో రైతులు ఉత్సాహంగా రొయ్యల సాగు ప్రారంభించారు. విద్యుత్‌ కోతలు తమ ఆశలపై నీళ్లు జల్లుతున్నాయని వారు వాపోతున్నారు.

News June 1, 2024

అనంత జిల్లాకు వర్ష సూచన

image

అనంతపురం జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వారు పేర్కొన్నారు.