Andhra Pradesh

News March 18, 2024

NLR: పోలంరెడ్డికి MLC హామీ?

image

కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.

News March 18, 2024

సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వీఐపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు, అతిథి మర్యాదలు ఉండవు. ఎంతటి వారైనా సాధారణ భక్తులు లాగే స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే సిఫార్సు లేఖలూ చెల్లవని స్పష్టం చేశారు.

News March 18, 2024

CTR: ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లు స్వాహా

image

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.

News March 18, 2024

క‌ష్ణా: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

image

కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. విజయవాడలో గత వారం క్రితం రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 నుంచి రూ.220 ధర పలుకుతోంది. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గింది. దీంతో నాన్‌వెజ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

News March 18, 2024

శ్రీకాకుళం: పోలీసు స్పందన కార్యక్రమం రద్దు

image

సార్వత్రిక ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులో ఉన్నందున, శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన పోలీసు స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సోమవారం తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం స్పందన కార్యక్రమం నిర్వహించబడదని ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 18, 2024

పల్నాడు: 2 బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్‌ పై ఉన్న మమత, గుణశేఖర్‌ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.

News March 18, 2024

కాకినాడ జిల్లాలో ACCIDENT.. కన్నీటి ఘటన

image

కిర్లంపూడిలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు <<12873564>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వెంకటేశ్ (20), హరిసాయి వెంకట్ (20) సామర్లకోటకు పనినిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాజుపాలెం శివారులో బొలెరో వాహనం ఢీకొనగా చనిపోయారు. తండ్రి గతంలో చనిపోగా వెంకటేశ్ చిన్న ఉద్యోగం చేస్తూ సోదరి, తల్లిని పోషిస్తూ వస్తున్నాడు. హరిసాయి ఇంటర్ చదవగా ఉద్యోగప్రయత్నంలో ఉన్నాడు.

News March 18, 2024

ఏలూరు: కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం

image

కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆగిరిపల్లి మండలంలో జరిగింది. SI సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమ్మూరుకు చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 7వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు SI తెలిపారు.

News March 18, 2024

అన్నమయ్య: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

image

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. పీటీఎం మండలం చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఏఎస్ఐని 108లో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

News March 18, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతి చెందారు. వోలేటివారిపాలెం మండలం కొండ సముద్రానికి చెందిన వేణుగోపాల్(32) జగిత్యాల జిల్లా కొండగట్టుకు వలస వెళ్లారు. నిన్న ఉదయం పసుపులేటి శ్రీకాంత్ (27), వెంకటేశ్ (33) కూలీలను తన బైక్‌పై తీసుకుని మెట్‌పల్లిలో మేస్త్రి పనులకు బయలుదేరాడు. జగిత్యాల-కోరుట్ల మార్గంలో వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.

error: Content is protected !!