India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల ఫలితాల కోసం చిత్తూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

ఎన్నికల ఫలితాల కోసం విజయనగరం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

ఎన్నికల ఫలితాల కోసం నెల్లూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

ప.గో.తో పాటు తూ.గో జిల్లా ఉండ్రాజవరం, పెరవలి, అంబాజీపేట, రావులపాలెం, అయినవిల్లి, రాజోలు, కొత్తపేట, అమలాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను శుక్రవారం తణుకు పోలీసులు అరెస్టు చేశారు. వెంకటనారాయణ (భీమవరం) ఈశ్వరరావు (తణుకు) పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ చోరీలకు పాల్పడ్డారని, వారి నుంచి రూ.47.22 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

బాచుపల్లి PS పరిధి కౌసల్యకాలనీలో విషాదం నెలకొంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరవర్ధన్ రెడ్డి(33) ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం వాసి వీరవర్ధన్ గత కొంతకాలంగా బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. తన భార్య డెలివరీ కోసం ఇటీవల కుమారుడితో కలిసి స్వస్థలానికి వెళ్లింది. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే సూసైడ్‌కు కారణమని తెలుస్తోంది. కేసు నమోదైంది.

టూరిజం బోటింగ్ కంట్రోల్ రూం పర్యవేక్షణలో రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో నిర్వహించే మూడు పర్యాటక స్పీడు బోట్లను శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. తుపాను కారణంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికల మేరకు సంబంధిత అధికారులు ఆరు రోజులుగా వీటిని నిలిపివేశారు. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ యధావిధిగా నడుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యాడికి మండలం కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో గీత అనే మహిళ శుక్రవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివాహమై ఐదు సంవత్సరాలు పూర్తయినా.. పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ/డీపీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ముసునూరు మండలానికి చెందిన వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్లు SI వాసు తెలిపారు. సదరు వ్యక్తిపై SC, ST కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సూరేపల్లికి చెందిన చెన్నకేశవరావు కొన్నేళ్లుగా మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. గత నెల 29న ఉదయం ఆమె గేదెలు మేపేందుకు పొలాల వైపు వెళ్లగా.. అక్కడ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కులం పేరుతో దూషించాడు. మహిళ వెళ్లి భర్తకు విషయం చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నగరంలోని రామానాయుడు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. లంకాపట్నానికి చెందిన పొడుగు కిశోర్, పొడుగు హేమంత్ ఇద్దరూ కలిసి కోట వద్ద ఉన్న తన అమ్మమ్మకు క్యారేజి ఇచ్చేందుకు వెళ్లారు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.