India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాయచోటి పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నమండెంకు చెందిన పవన్ కుమార్ (35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ రాయచోటిలోని వెంకటేశ్వరస్వామి ఆలయ వీధిలో నివాసం ఉంటున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పది రోజుల కిందట భార్య శారద ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పోస్టల్ బ్యాలెట్‌పై వివాదాల రేపేందుకు తంటాలు పడుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వారి దింపుడుకళ్లెం ఆశలు ఫలించవని, ఆ పార్టీ ఓటమి పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కానుందన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాశ్వతంగా దూరమైపోయిందన్నారు.

ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆమంచర్లలోని పొలాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు నీలం రంగు ప్యాంటు, ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టెక్నాలజీ పుణ్యమా అంటూ అమాయకులను బుట్టలో వేసుకొని నిండా ముంచుతున్నారు సైబర్ నేరగాళ్లు. మార్కాపురం పట్టణంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాడు సోషల్ మీడియాలో వచ్చిన లింకును ఓపెన్ చేస్తే షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయని బ్యాంకు ఉద్యోగికి టోకరా వేసి, ఓ ఉద్యోగి నుంచి రూ.34 లక్షలు కాజేశాడు. రోజులు గడుస్తున్నా డబ్బుల విషయంలో స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు మండలంలోని రేగళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగళ్లుకస్పాకు చెందిన పూజారాజ భార్య రామాంజుల కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరికొద్దిరోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. తొలిసారి నెంబర్ల ప్లేట్లపై సరికొత్త యుద్ధానికి వైసీపీ, TDP, జనసేన అభిమానులు దిగుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నంబర్ ప్లేట్లను కొట్టిస్తున్నారు. నంబర్ ప్లేట్లను డిజైన్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఇదో కొత్త ట్రెండ్‌గా మారింది అని రాజాంలోని ఓ స్టిక్కరింగ్ దుకాణం యజమాని తెలిపారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఫలితాలు, అపోహలను ప్రజలు నమ్మొద్దని శ్రీకాళహస్తి డి.ఎస్.పి ఉమామహేశ్వర రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఓట్ల కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణ్ పేర్కొన్నారు. శుక్రవారం కనుపర్తి పాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటే చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులకు ప్రత్యక్షంగా 1,100 మంది, పరోక్షంగా 2,500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించాలన్న యోచనలో వైసీపీ ఉందని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పిఠాపురంలో ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లను, గొడవలు సృష్టించే వారిని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా పెడుతోందని ఆరోపించారు. ఓడిపోతున్నామనే భయంతో జగన్ కొత్త నాటకాలకు తెర తీస్తున్నారన్నారు. కాకినాడ ఎస్పీ దృష్టి సారించాలని కోరారు.

చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఓఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం నెల్లూరు జట్టు విజయం సాధించాయి. నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కడప జట్టుపై విజయం సాధించింది. కడప బ్యాట్స్‌మెన్ వంశీకృష్ణ 100 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. నెల్లూరు బ్యాట్స్‌మెన్ ఫర్హాద్ ఖాద్రి 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచి నెల్లూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Sorry, no posts matched your criteria.