India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలీసెట్ కౌన్సిలింగ్‌ను ఎన్నికల ఫలితాల దృష్ట్యా పలు మార్పులు చేశారు. ఈ మేరకు జూన్ 3న జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 6న జరుగుతుంది. ప్రత్యేక రిజర్వేషన్లు వర్తించే వారికి సైతం ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. పాత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు ఎంట్రీకి ఈనెల 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం ఇవ్వగా.. ప్రస్తుతం జూన్ 7 నుంచి 10 వరకు మార్పు చేశారు. అలాట్మెంట్‌ల ప్రకటన జూన్ 7 నుంచి 13వ తేదీకి మార్చారు.

APSRTC ప.గో.జిల్లా ప్రజారవాణ అధికారిగా ఎన్వీఆర్ వరప్రసాద్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న వీరయ్య చౌదరి పదవీవిరమణ చేయడంతో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా పనిచేస్తున్న వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్యచౌదరికి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్- BLISC డిగ్రీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

కౌంటింగ్ ప్రక్రియ, అధికారుల చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన కీలక దశకు చేరుకున్నట్టు తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరూ ఏయే విధులు నిర్వహించాలనే క్రమంలో ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

గత ఏప్రిల్ 29వ తేదీన యానాం నుంచి డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు వస్తున్న ఆటో భట్నవిల్లి దగ్గర లారీని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు యువకులు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందారు. కాగా నగరం పితానివారి మెరకకి చెందిన మాదాసి ప్రశాంత్ కుమార్ (17) శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.

జిల్లాలోని సీతం కళాశాల సమీపంలో ఓ అంబులెన్సు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్స్‌లో పేషెంట్‌ను తీసుకువస్తున్న సమయంలో సీతం కళాశాల వద్ద లారీను తప్పించబోయి ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నెల్లిమర్లలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు వైసీపీ-జనసేన మధ్య హోరాహోరీగా జరిగాయి. వైసీపీ తరఫున సిట్టింగ్ MLA బడ్డుకొండ పోటీలో నిలవగా.. కూటమి అభ్యర్థిగా నాగ మాధవి బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నప్పటికీ, కూటమి శ్రేణుల్లో మాత్రం బకెట్ గుర్తు కలవర పెడుతోందని సమాచారం. ఈవీఎంలో తొమ్మిదో నంబర్ బకెట్ గుర్తు కాగా.. పదో నంబర్ గ్లాస్ గుర్తు రావడమే ఈ కలవరానికి కారణంగా తెలుస్తోంది.

చీరాలలో ఓ వ్యక్తి పర్చూరు వరకు లిఫ్ట్ కావాలని లారీని ఆపాడు. లారీ డ్రైవర్ మానవతా దృక్పథంతో అతడిని ఎక్కించుకున్నాడు. కారంచేడు కాలువ సెంటర్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ మంచినీటి కోసం కిందకి దిగాడు. అదే అదునుగా భావించి లారీలో ఉన్న డ్రైవర్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెతుకుతుండగా కొద్ది దూరంలో ఫోన్ పడేసి పరారయ్యాడు.

రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు వీడ్కోలు పలికారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఢిల్లీ వెళుతున్న అమిత్ షాను తిరుపతి, శ్రీకాళహస్తి నేతలు కలిశారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని నినాదాలు చేశారు.

తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. కొవ్వూరు టౌన్ SI జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు పట్టణం 2వ వార్డుకు చెందిన ఆనంద బాబు (32) తల్లి మహాలక్ష్మిని డబ్బులు కావాలని అడిగాడు. అయితే డబ్బులు దుబారాగా ఖర్చు చేస్తున్నావని ఆమె మందలించింది. దీంతో అతడు స్థానిక ఎరిణమ్మ ఇసుక ర్యాంపు వద్ద ఉరేసుకొని చనిపోయాడు. తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు నమోదుచేసినట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.