India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బేబి సినిమా ఫేం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గంగం గణేషా శుక్రవారం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమాను చూసిన ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సినిమా డైరెక్టర్ ఉదయ్ బొమ్మి శెట్టి తల్లిదండ్రులు పలమనేరు వాసులు కావడంతో వారు సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినిమా రంగంలో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు.

ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో శుక్రవారం ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా అంతటా నిఘా ఉంచామన్నారు.

ఓట్ల కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణ్ పేర్కొన్నారు. శుక్రవారం కనుపర్తి పాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటే చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులకు ప్రత్యక్షంగా 1,100 మంది, పరోక్షంగా 2,500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టుచేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గౌస్ బాషా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం ఈ అల్లర్ల కేసులో 140 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.

నేడు విజయవాడలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు ప్రింట్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ డీజీగా పదవీ విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ఆయన ఘనంగా సత్కరిస్తున్నారు. మరోవైపు తాడేపల్లిలో సీఎం జగన్ ఓఎస్డి ధనుంజయ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ధనుంజయ రెడ్డిని సన్మానించడానికి పలువురు వైసీపీ నేతలు తరలివస్తున్నారు.

జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత రిటర్న్ అధికారి జారీ చేసిన ఐడీ కార్డ్, పాస్ ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. కౌంటింగ్ కేంద్రం లోపలకు మొబైల్ ఫోన్ అనుమతించరు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే శిక్షకు అర్హులవుతారని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు అమలు అవుతాయి.

అన్నమయ్య జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కట్లుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా ఇద్దరిపై జిల్లా బహిష్కరణ చర్యలు చేపట్టారు. రాజంపేట జడ్పీటీసీ భర్త దాసరి పెంచలయ్య, పుల్లంపేట రాజారెడ్డిపై కౌంటింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో అడుగు పెట్టవద్దన్నారు. అలాగే రాజంపేట, కోడూరులో 60 మందికి గృహనిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.

కౌంటింగ్ రోజు ఏర్పడే అవాంఛనీయ ఘటనలను ఆదిలోనే కట్టడి చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 5 డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

రేపు శనివారం కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

కందుకూరు 8 వార్డు సచివాలయంలో పనిచేస్తున్న తనను అదే సచివాలయంలో విధులు నిర్వహించే అడ్మిన్ నమ్మించి మోసం చేశాడని మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తి ఆమెతో రెండు ఏళ్ళ పాటు ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకోమని అడిగితే మాట దాటేస్తూ.. పెళ్లి చేసుకునేది లేదంటూ చెప్పడంతో చేసేది లేక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.