India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పరిటాల సునీత విమర్శించారు. రామగిరి మండలం వెంకటాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ కనుసన్నల్లో పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని ఆరోపించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.

ప్రకాశం బ్యారేజీ 68వ కానా పైనుంచి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు ఆమెను బయటకు తీశారు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదవ తరగతి సప్లిమెంటరీ అడ్వాన్స్‌డ్ పరీక్షలు కృష్ణా జిల్లాలో ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా సోషల్ స్టడీస్ పరీక్షకు 1950 మంది విద్యార్థులకు 594 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన 07 కేంద్రాలను సందర్శించగా ఒక్కమాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి RGM, శాంతిరామ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఈ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపును ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడడం, చట్ట విరుద్ధమైన సమావేశాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

మంగళగిరిలో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు 11వ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన పరుచూరి కుమారి నంద పాల్గొని సత్తా చాటింది. సీనియర్ మహిళల 76 కేజీల పవర్ లిప్టింగ్ విభాగంలో, అలాగే బెంచ్ ప్రైస్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొని రెండు సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆమెను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

మండలంలోని తొర్రగుంటపాలెంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొర్రగుంటపాలెం వచ్చే రోడ్లో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని హైడ్రో మిషన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తిని చిల్లకల్లు ధర్మవరపాడు గ్రామ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఏపీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేష సాయి అందించిన సేవలు ప్రసంశనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నశేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఏడీసీసీ బ్యాంక్ సీఈఓగా సురేఖారాణి నియమితులయ్యారు. అవినీతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని అందజేసిన సీఈఓ ఏబీ రాంప్రసాద్ దీర్ఘకాలిక సెలవులకి వెళ్లారు. దీంతో ఏడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖారాణికి సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆప్కాబ్ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏడీసీసీ బ్యాంకు సీఈఓగా సురేఖారాణి బాధ్యతలు స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.