India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మద్దిలపాలెంకు చెందిన శ్రీనివాసరావుకు ఈనెల 24న ఫేస్ బుక్‌లో కలెక్టర్ పేరుతో ఉన్న ఫేక్ ఖాతా నుంచి హాయ్ అంటూ తన ఫోన్ నంబర్ పంపమని అడిగారు. శ్రీనివాస్ నెం. షేర్ చేయగానే మరో మెసేజ్ వచ్చింది. అందులో ‘నా ఫ్రెండ్ సంతోశ్ కుమార్ CRPF క్యాంప్ నుంచి బదిలీ అవుతున్నాడు. దీంతో రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ రూ.85,000 ఇచ్చేస్తున్నాం, అడ్వాన్స్‌గా రూ.10 వేలు పంపించండి’ అని ఉంది. అతడు ఫోన్ చేసి అడగగా కట్ చేశారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో మిగిలి ఉన్న 6,7,8,9 తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 20న జరిగే పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.

ఏపీఈసెట్ ఫలితాల్లో డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాసి అద్భుత ప్రతిభ కనబరిచాడు. కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలేనికి చెందినగొలకోటి నితిన్ ధనుంజయ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, తెలంగాణలో 4 వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు గొలకోటి సత్తిబాబు- వరలక్ష్మి దంపతులు అభినందించారు. భవిష్యత్తులో గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

కురిచేడు మండలంలోని బోధనంపాడులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ అబుదావలిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బీరు సీసాతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ వల్లే ఈ దాడి జరిగినట్లుగా స్థానిక ప్రజలు తెలిపారు. అబుదావలి పరిస్థితి విషమంగా ఉండటంతో దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోని జేఎన్టీయూలో నిర్వహిస్తున్నందున జేఎన్టీయూ నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూను ప్రత్యేక పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి 2,36,726 పెన్షన్లలో 1,80,216 పెన్షన్ దారులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి టెక్కలి సమీపంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ కాగా తదుపరి బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు 39.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది.

ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతంలోని దాసరపల్లి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నేలటూరు గ్రామానికి చెందిన మేడేపల్లి రమణయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై కొండాపురం వెళుతుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఘటనలో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

తమిళనాడులో భారీవర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందటి వరకు 75 కేజీల బస్తా రూ.100- 150 పలకగా, ప్రస్తుతం రూ.200 దాటింది. ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాల్లో ఉప్పు తయారీచేస్తున్నారు. గతంలో ఎకరాకు 800- 900 బస్తాల దిగుబడి వస్తుండగా, ఈ సారి 1,300 నుంచి 1,400 వరకు వస్తోంది. పెరగడంతో దాదాపు 7వేల మంది రైతులు, 10 వేలకు పైగా కూలీలకు లబ్ది చేకూరుతుంది.

సింహాద్రిపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న దావూద్ హుస్సేన్ ఏపీ ఈసెట్‌లో 105 ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి దావూద్ హుస్సేన్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుల బోధన, సహకారం వలన 105వ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. హుస్సేన్‌ను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.