India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 0863-2234301 నంబరుకు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు.
జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికను అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అతడికి 10 జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనానికి చెందిన మిడసాల శివకృష్ణ(32) 2014లో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 13 ఏళ్ల బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
రైలు కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం మాచర్ల ప్యాసింజర్ రైలు వస్తున్న సమయంలో గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 25, 26 తేదీల్లో సత్రాగచ్చి(SRC), మహబూబ్‌నగర్(MBNR) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25న నెం.08845 SRC- MBNR, ఈ నెల 26న నెం.08846 MBNR- SRC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో ఆగుతాయన్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి <<12893521>>వరదరాజుల రెడ్డి<<>>పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మంగళవారం 38వ వార్డులో, 22వ వార్డులో వరదరాజుల రెడ్డి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పాతపట్నం నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కలమట వెంకటరమణమూర్తి, రెడ్డిశాంతి వరసగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ వెంకటరమణ 2019 టీటీపీ నుంచి వైసీపీ అభ్యర్థి రెడ్డిశాంతిపై పోటీచేసి ఓడిపోయారు. కలమట వెంకటరమణ తండ్రి కలమట మోహనరావు టీడీపీ నుంచి నాలుగుసార్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి గెలిచారు. వైసీపీ నుంచి రెడ్డిశాంతికి టికెట్ కన్ఫామ్ అయ్యింది. పాతపట్నంలో ఈ సారి గెలిచేదెవరు.
216వ నంబర్ జాతీయ రహదారిపై తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్టు కోరంగి పోలీసులు తెలిపారు. యానాం నుంచి కాకినాడ వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
జిల్లాలో జరగుతున్న పదో తరగతి పరీక్షల్లో 588 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో శ్యాముల్ బుధవారం తెలిపారు. ఆంగ్ల పరీక్షకు మొత్తం 31,465 మందికి గాను 30,878 మంది విద్యార్థులు పరీక్ష రాసారని తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదన్నారు. అలాగే సార్వత్రిక విద్యలో పదో తరగతి పరీక్షకు 964 మందికి గాను 891 మంది పరీక్ష రాసినట్లు 73 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
అనంతపురం నగరంలోని పాతూరు మార్కెట్లో కూరగాయల ధరల వివరాలు… టమాటాలు (మేలు రకం) ₹20, రెండో రకం ₹10, మిరపకాయలు ₹50, ఉల్లిపాయలు (మేలు రకం) ₹25, రెండో రకం ₹15, ఆలుగడ్డలు ₹35, బీన్స్ ₹60, క్యారెట్ (మేలు రకం) ₹42, రెండో రకం ₹30, వంకాయలు ₹30, బెండకాయలు ₹40, ముల్లంగి ₹40, బీట్ రూట్ ₹40, బీరకాయలు ₹40, చౌళేకాయలు ₹40, కాకరకాయలు ₹40, క్యాబేజీ ₹40, మునక్కాయలు ₹60, నిమ్మకాయ (వంద) ₹350, అల్లం (కొత్తది) ₹140.
ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించిన యువకుడిపై కేసు నమోదైందని ఉండి పోలీసులు తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక తాతయ్య వద్ద ఉంటోంది. యండగండి గ్రామానికి చెందిన చంటి ప్రేమ పేరిట వెంటపడి వేధిస్తుండేవాడని పోలీసులు తెలిపారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి పెళ్లికి ఒప్పుకోకపోతే చంపుతానని బెదిరించాడన్నారు.దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.