India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధర్మవరంలో బుధవారం న్యాయవాది సంపత్ కుమార్ హత్యకు గురైన విషయం తెలిసిందే.. మృతుని స్నేహితునికి, మరో న్యాయవాది కృష్ణారెడ్డికి స్థల వివాదం ఉందని, స్నేహితుడికి మద్దతు తెలపడంతో హత్య చేశారని సంపత్ తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి హంతకులు సంపత్‌ను హిందూపురంలో కారులో ఎత్తుకెళ్లి మార్గమధ్యలో కొడవలిలో నరికి చంపి.. ధర్మవరం చెరువు కట్టలో పడేసినట్లు సమాచారం. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాతపూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ భోగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గురువారం సుమారు మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచింది. సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకోవాల్సిన రైలు రాత్రి 9 గంటల తర్వాత వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రైలు కనీసం 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విశాఖ <<13346298 >>సాగర్ నగర్<<>> కారు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రగుంట్ల క్రాంతికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడ్డ నిందితుడు మద్యం మత్తులో రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరుకు చెందిన డెలవరీ బాయ్ ఎస్.గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని KGHకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుపతి, చిత్తూరులో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పటిష్ఠంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్వీ సెట్‌లో, తిరుపతి జిల్లాకు సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వాటి చుట్టూ 2 కిలో మీటర్ల మేర ఎక్కడా డ్రోన్లు ఎగర వేయకూడదు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెకు సంబంధించి రాయచోటిలో కౌంటింగ్ జరగనుంది.

బెంగళూరుకు చెందిన ఇంపాన(23), చేతన్ ల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. వీరికి పెద్దలు పంచాయతీ చేసి నగదు ఇచ్చేలా ఒప్పందం రాయించారు. తరువాత చేతన్ మరొకరిని వివాహం చేసుకుని చీమకుర్తిలో బేకరీ నిర్వహిస్తున్నాడు. బుధవారం చీమకుర్తికి వచ్చిన ఇంపాన పెళ్లి చేసుకోవాలని చేతన్‌ను అడగ్గా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

వర్షం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు. పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే ఏ రంగానికి సంబంధం లేకుండా అందరూ ఎదురు చూసే ఫలితాలు ఎన్నికల ఫలితాలు. దీంతో జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పలువురు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరలేవాలంటే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

కళ్యాణదుర్గం మండలంలోని హులికల్లు బీసీ కాలనీ సమీపంలో గురువారం
చిరుత సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలాలకు వెళ్లే రైతులు, కాలనీవాసులు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. చిరుతను బంధించి అడవిలో వదలాలని కోరుతున్నారు. అటవీ అధికారి నాగే నాయక్ సిబ్బందితో రాత్రి గస్తీ నిర్వహించారు.

ప.గో జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో 216వ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. 216వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం పాలకొల్లు వైపు నుంచి నరసాపురం వైపు వెళ్తున్న దంపతుల బైక్‌ను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులకు గాయాలు కాగా.. స్థానికులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

మండలంలోని మోర్సపూడిలో శ్రీనివాస హాజరి కంపెనీలో గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహానికి సుమారు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కంపెనీలో ఉత్తరపు గేటు సమీపంలో ఈ మృతదేహం ఉన్నట్లుగా నూజివీడు రూరల్ ఎస్సై తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.