India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ <<13346298>>సాగర్ నగర్<<>> కారు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రగుంట్ల క్రాంతికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడ్డ నిందితుడు మద్యం మత్తులో రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరుకు చెందిన డెలవరీ బాయ్ ఎస్.గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని KGHకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మాధవరాయుని పేటకు చెందిన పిల్లి ధరణి సత్య(23) చెన్నైలో రైలు ఢీకొని మృతి చెందింది. చెన్నైలోని ఓ కంపెనీలో ధరణి 8 నెలలుగా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుందని కుటుంబీకులు తెలిపారు. సహోద్యోగులతో కలిసి లోకల్ ట్రైన్ దిగి విధులకు వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతుండగా.. మరో రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మాధవరాయునిపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది.

కోసిగి మండలంలోని దొడ్డి గ్రామానికి చెందిన అడివప్ప(48) గ్రామ శివారులోని మాలబండ వద్ద మృతి చెందాడు. భార్య తెలిపిన వివరాల మేరకు కోసిగిలో కట్టెల మిషన్‌లో పనిచేసేవాడని తెలిపింది. రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్నాడని, పక్కనే బైకుకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆరోపించారు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు జూన్ 2,3,4,5 తేదీలలో షాపులు పూర్తిగా మూసి వేయనున్నట్లు, నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శనివారం ఐదు గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనంతరం షాపులు మూసి వేయవలసిందిగా కిషోర్ కోరారు.

ఎచ్చెర్లలోని శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 2కి.మీ పరిధి వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు SP రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. రెడ్ జోన్ అమలు చేస్తున్న నేపథ్యంలో డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడం నిషేధించినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమించరాదన్నారు.

దోర్నాల మండలం యడవల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర నాయుడు బైకుపై వెళ్తున్న నేపథ్యంలో వాహనం అదుపుతప్పి టిప్పర్‌ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు జిల్లాలోని రైతులకు వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆత్మ సహకారంతో గ్రామస్థాయిలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేవారు. రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లి వ్యవసాయ రంగంలో నూతన అంశాలను వివరించే వారు. ప్రస్తుతతం ఆత్మ సేవలు లేకపోవడంతో రైతులు చెందుతున్నారు. ఆ సేవలు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

ఏపీ ఈసెట్ ఫలితాల్లో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆమదాలవలస మండలం శ్రీహరిపురానికి చెందిన కూన జ్యోత్స్న 8వ ర్యాంకు (బ్రాంచ్ ర్యాంక్), ఇంటిగ్రేటెడ్ ర్యాంక్-826 సొంతం చేసుకుంది. ఈ విద్యార్థిని 200 మార్కులకు గాను 105 మార్కులు సాధించింది. 10వ తరగతి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదవగా.. డిప్లొమా అనకాపల్లిలో పూర్తి చేసింది. మంచి ర్యాంక్ రావడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

2019లో శ్రీకాకుళం MP అభ్యర్థిగా YCP నుంచి బరిలో దిగిన దువ్వాడ శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నపై పోటీ చేస్తున్నారు. అటు టెక్కలిలో 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్.. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2019లో పరాజయం పాలైన వీరిద్దరికి వైసీపీ అధిష్ఠానం మరలా టికెట్ ఇచ్చింది. స్థానాల మార్పు వైసీపీకి ఇక్కడ విజయం అందిస్తుందా..? దీనిపై మీ కామెంట్?

నెల్లూరు: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 6 వరకు.. ఆప్షన్లను పదో తేదీ వరకు.. ఆప్షన్ల మార్పు 11 వరకు.. సీట్ల కేటాయింపు 13న.. జాయినింగ్ రిపోర్టులను 14 నుంచి 19వ తేదీ వరకు అందజేయనున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.