Andhra Pradesh

News May 31, 2024

చివరగా పలమనేరు ఫలితం..?

image

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పలమనేరులో 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అత్యల్పంగా చిత్తూరులో 226, నగరిలో 229 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి ఈవీఎంల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చిత్తూరు లేదా నగరి ఎమ్మెల్యే ఎవరనేది ముందుగా తెలుస్తుంది. చివరగా పలమనేరు ఫలితం తేలే అవకాశం ఉంది. చిత్తూరు SVసెట్‌లో కౌంటింగ్ జరుగుతుంది.

News May 31, 2024

మైదుకూరు MLA రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట

image

మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చాపాడు పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ఈనెల 6వ తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుతో సహా ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

News May 31, 2024

శ్రీకాకుళం: విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన వివాహిత బెవర మేరీ సలోమి(22) గురువారం ఉరివేసుకొని మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సలోమికి, పెనసాంకు చెందిన జగదీశ్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమార్తె. సలోమి ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం అందడంతో SI మధుసూదనరావు వెళ్లి పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులు విజయవాడలో ఉండటంతో ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.

News May 31, 2024

GOOD NEWS.. గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

ఏలూరులోని బీసీ స్టడీ సర్కిల్లో జూన్ 1 నుంచి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారిణి నాగరాణి తెలిపారు. గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనన్నట్లు వివరించారు. జూలై 28వ తేదీన జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News May 31, 2024

VZM: చెక్‌బౌన్స్ కేసులో టీచర్‌కి జైలు శిక్ష

image

చెక్‌బౌన్స్ కేసులో టీచర్ జాగరపు వెంకట అప్పారావుకు 6 నెలల జైలుశిక్ష విధిస్తూ S.KOTA జూనియర్ సివిల్ జడ్జి వాణి గురువారం తీర్పు చెప్పారు. ధర్మవరానికి చెందిన శ్రీనివాసరావు నుంచి కుమరాంకి చెందిన వెంకట అప్పారావు రూ.2 లక్షలు అప్పు తీసుకొని రూ.1.50 లక్షలకు చెక్కు ఇచ్చారు. చెక్కు చెల్లకపోవడంతో కోర్టును ఆశ్రయించగా శిక్ష ఖరారైంది. నెల రోజుల్లో చెల్లించకపొతే మరో 6 నెలల శిక్ష ఉంటుందని తీర్పు వెల్లడించారు.

News May 31, 2024

నెల్లూరు: భారీగా దొరికిన బంగారం, డబ్బు

image

కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద రూ.కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. చెన్నై బస్సులో సీఐ శ్రీనివాసరావు తనిఖీలు చేయగా ఐదుగురు మహిళల వద్ద రూ.1.61 కోట్లు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. అలాగే మిర్యాలగూడ నుంచి చెన్నై వెళ్తున్న కారులో రూ.కోటి విలువైన 1497 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికాయి. మరోవైపు వెంకటాచలం టోల్‌గేట్ వద్ద 1.65 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు.

News May 31, 2024

గుంటూరు: కట్నం కోసం భార్యను కొరికిన భర్త పై కేసు

image

అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీకి, కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ ముస్కాన్‌కు ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటైన భర్త అదనపు కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

కనిగిరి: గుండెపోటుతో బస్సులో ఫొటోగ్రాఫర్ మృతి

image

ఒంగోలు నుంచి కనిగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సులో వెలిగండ్ల మండలం అగ్రహారానికి చెందిన ఫొటోగ్రాఫర్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కనిగిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ వెళ్లి చూడగా.. సీటులో పడిపోయి ఉన్నాడు. రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

పెనమలూరు: కట్నం కోసం భార్యను కొరికిన భర్త పై కేసు

image

అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ ముస్కాన్‌కు, గుంటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీకి ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటై కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

అనంత జిల్లాలో తొలి ఫలితం విడుదల ఇక్కడే..?

image

అనంత జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం తొలి ఫలితానికి నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండకు 18 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఇక్కడ 15 రౌండ్లకే లెక్కింపు పూర్తవుతుంది. దీంతో తొలి ఫలితం విడుదల కానుంది. కళ్యాణదుర్గం 19, గుంతకల్లు, తాడిపత్రి 20, శింగనమల, అనంత, రాప్తాడు 21, రాయదుర్గం 22 రౌండ్లలో లెక్కించనున్నారు. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానుండగా.. గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.