India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రాయలసీమ వర్శిటీలో జరగనుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించి 17 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండనుంది. కాగా తొలిఫలితం మంత్రాలయానిది వెలువడే అవకాశం ఉంది. చివరన ఆలూరు నియోజకవర్గ ఫలితం తెలియనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయా కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుల్ ఏర్పాటు చేశామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం లేపాక్షిలో కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు భారీ ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల కౌంటింగ్ కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు.

అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెంది పదో తరగతి విద్యార్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాత్కాలిక అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారన్నారు.

పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కొరకు బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ధ్రువపత్రాలను పరిశీలించామని ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం 59,001 నుంచి 79,000 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మొదటి వారంలో 144 సెక్షన్ విధింపు కారణంగా పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూల్లో మార్పులు వేశామని, జూన్ 3న అన్ని పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల ఈసెట్‌లో యారాడకుకి చెందిన మనోహర్ సత్తా చాటాడు. తెలంగాణ ఈసెట్‌లో మొదటి ర్యాంకు, ఏపీ ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తండ్రి గురనాథరావు ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా.. తల్లి పాపాజీ గృహిణి. ఈ సందర్భంగా మనోహర్‌ను పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రల కష్టాలు తీర్చడమే లక్ష్యమని మనోహర్ తెలిపాడు.

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును నాగార్జున గురువారం రాత్రి కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో జరిగిన ఎన్నికల సరళిని వివరించారు. జిల్లాలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

నెల్లూరు జిల్లాలో 3,14,422 మంది లబ్ధిదారులకు పింఛన్ కానుక అందజేయనున్నారు. 2,28,471 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జూన్ 5వ తేదీలోపు జమ చేస్తారు. దివ్యాంగులు, ఆరోగ్యం సక్రమంగా లేని 85,951 మంది లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ విభాగంలో గురువారం పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరంలో 5,990 మందికి గాను 5,538 మంది.. ద్వితీయ సంవత్సరంలో 986 మందికి గాను 887 మంది.. వృత్తి విద్యా విభాగంలో 288 మందికి 214 మంది మొత్తం 6,639 మంది హాజరయ్యారని ఆర్‌ఐఓ నరసింహం తెలిపారు.

ప్రొద్దుటూరులో రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఓ వ్యక్తికి రిమాండ్‌కు పంపే క్రమంలో నిందితుడిని కానిస్టేబుల్ రూ.5 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తామన్నా వినలేదు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో కానిస్టేబుల్‌పై ACBకి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే కానిస్టేబుల్ పై పలు ఆరోపణలు వచ్చాయన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో డోన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అవినీతికి బాధ్యులైన 14 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం, డీజిల్ కొనుగోలులో రూ.24 లక్షల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.