India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ట్రైన్ నంబర్ 12513 సికింద్రాబాద్- సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను జూన్ 1న రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ రైలు ప్రయాణించే మార్గంలో ట్రాక్ సస్పెన్షన్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

దొంగ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని రాజమండ్రిలోని ప్రకాశంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారని సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన నరసింహారావు, హేమ నాయక్, రాజమండ్రిలోని జాంపేటకు చెందిన రెహమాన్, అస్లిమ్, రావులపాడుకు చెందిన నరసింహమూర్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరు హైదరాబాద్‌లో రూ.2 లక్షల విలువ గల రూ.500 దొంగ నోట్లు కొనుగోలు చేసి చలామణి చేస్తూ దొరికారన్నారు.

ప్రేమ పేరుతో మోసగించిన ఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో వెలుగు చూసింది. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి వివరాల మేరకు.. దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించాడు. ‘కులాలు వేరు కావడంతో నా తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఏమైనా చేసుకో’ అని యువకుడు బాలికతో అన్నాడు. దీంతో ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతోంది.

అద్దంకికి చెందిన మహిళ బుధవారం సాయంత్రం స్నానం చేస్తోంది. ఇదే సమయంలో పక్కింటి బాలుడు ఆమెను వీడియో తీశాడు. దీన్ని గుర్తించిన మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని నిలదీశారు. తొలుత తాను అలాంటి చర్యలకు పాల్పడలేదని బుకాయించినప్పటికీ అనంతరం మొబైల్ పరిశీలించగా దృశ్యాలు కనిపించడంతో చేసిన తప్పును అంగీకరించాడు. ఆమేరకు మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

NLR: అపార్ట్‌మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న వ్యభిచార కేంద్రంపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలితో పాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంకు ప్రాంతానికి చెందిన శ్రీలత 9 నెలల క్రితం టెక్కేమిట్టలోని ఓ అపార్ట్‌మెంట్లో ఫ్లాటు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ దాడి చేశారు.

గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేటు వద్ద గురువారం సాయంత్రం 7 గంటలకు టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ చైన్‌ను రెండుసార్లు ఓ ప్రయాణికుడు లాగడంతో అరగంట సేపు నిలిచిపోయింది. మొదటి సారి రైల్వే గేటుకు ముందు నిలిచి.. కాసేపటికి తిరిగి కదిలింది. 50 మీటర్లు వెళ్లిన తర్వాత మళ్లీ రెండోసారి చైన్ లాగడంతో గేటు మధ్యలో ఆగిపోయింది. చైన్ ఎవరు లాగారో తెలుసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

ఫోన్ మాట్లాడుతూ నేలబావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన కే.కోటపాడులో చోటుచేసుకుంది. బస్టాండ్ వద్ద గ్రామానికి చెందిన బర్ల వెంకటరమణ(55) గురువారం సాయంత్రం ఫోన్ మాట్లాడుతూ నేలబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు అతడిని బయటకు తీశాయి. అప్పటికే అతడు మృతిచెందాడు. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళవద్దని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి జిల్లాలో లబ్ధిదారులందరికి సకాలంలో సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో1,64,452 మందికి డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నేరుగా 1వ తేదీన జమ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 46,965 మందికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు.

రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవ వేడుకలు గురువారం ముగిశాయని ఆలయ ఈవో నరసింహారెడ్డి మీడియాతో తెలిపారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సప్త ప్రాకారోత్సవం కార్యక్రమం చేపట్టారు. అనంతరం శయనోత్సవం కార్యక్రమం చేపట్టారు. దీంతో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయన్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన పట్టణ పుర ప్రజలకు, భక్తులకు ఆలయ ఈవో ధన్యవాదాలు తెలిపారు.

జూన్ 4న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.