India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో ఇరు పార్టీలకు చెందినవారు శాంతియుతంగా ఉండాలని, హింసాత్మక ఘటనలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.

జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలు, కేంద్రాలకు వెళ్లే దారుల వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరి కదలికలను కెమెరాలు రికార్డు చేస్తాయనే విషయాన్ని గమనించాలన్నారు.

అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అనకాపల్లి కలెక్టరేట్‌లో జరుగుతున్న శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుందన్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ముందుగా కంట్రోల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఉన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. నేడు విజయవాడలో సీపీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా, నోవా కళాశాలలో జూన్ 4వ తేదిన జరుగు ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

ఏలూరు: ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణ సాధించి మెయిన్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వెల్లడించారు. ఏలూరు బీసీ స్టడి సర్కిల్లోని అంబేద్కర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో జూన్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సూళ్లూరుపేటలో స్నేహితుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో మాట్లాడి.. యువతికి ప్రభుత్వ వసతి సదుపాయం కల్పించి, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.

విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ దంపతులు శుక్రవారం తెల్లవారు జామున 4:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. జగన్‌కు రక్షణ కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్‌లో కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

బైక్ వెనకాల నంబర్ లేకుండా మంత్రి తాలుకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటే వాటిని సీజ్ చేస్తామని అద్దంకి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. పట్టణంలో గొట్టిపాటి రవి మంత్రి తాలూకా అని, మరొకరు అద్దంకి ఎమ్మెల్యే హనిమిరెడ్డి తాలూకా అని బైక్ నంబర్ ప్లేట్లపై పేర్లు రాయించుకుని తిరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సీఐ వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.