India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూప్స్‌లో ఉద్దేశపూర్వకంగా కుల, మత, రాజకీయ పార్టీలను, వ్యక్తులను రెచ్చగొట్టేలా పోస్టులు, అవాస్తవాలు షేర్ చేయకూడదన్నారు. అలా ఎవరైనా చేస్తే అడ్మిన్స్‌తో పాటు ఆ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరిన వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్‌లుగా నియమిస్తామని జిల్లా కలెక్టర్ మాధవి లత గురువారం తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్స్ రిటర్నింగ్ అధికారి ముందు తన అపాయింట్మెంట్ లెటర్, గుర్తింపు కార్డు సమర్పించి డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. సంబంధిత ఆర్వో లేఖ ధ్రువీకరణ తర్వాత కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారని వివరించారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన LLB 6వ సెమిస్టర్(రివైజ్డ్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.

జిల్లాలోని రాచర్ల మండలం చోళవీడులో ఉరివేసుకొని మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. చోళవీడుకు చెందిన ఓ మైనర్ బాలుడు తన తల్లిదండ్రులు తను కోరిన సైకిల్ ఇప్పించలేదని ఇంటిలోకి వెళ్లి తలుపులు బిగించి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కష్టపడి పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కుషల్ శ్రీనివాస్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చాయి. హిందీలో 15 మార్కులే వచ్చాయి. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 75 మార్కులు వచ్చాయి. మెరుగైన మార్కులు వచ్చినా ఫెయిల్ చేయడంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి గురువారం ఏపీ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్రాంతి కుమార్ 176.81 మార్కులు సాధించి తొలి ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా పలువురు ఆ విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అంబులెన్స్ సిబ్బంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. అనంతపురం నగరానికి చెందిన ముస్తఫా ఆత్మకూరులో 104 అంబులెన్స్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అందరితో కలిసి అంబులెన్స్‌లో పంపనూరు తాండాకు ఇవాళ వెళ్లారు. సిబ్బంది అక్కడ వైద్య సేవలు నిర్వహిస్తుండగా పక్కన ఉన్న ఖాళీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రముఖ దర్శకుడు, పుష్ప-2 దర్శకుడు సుకుమార్ తన స్వగ్రామం రాజోలు మండలం మట్టపర్రులో గురువారం సందడి చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సొంత ఊరుకు వచ్చిన సుకుమారుడు పలువురు అభిమానులు కలిసి ఆయనతో సెల్ఫీలు దిగారు. అభిమానుల రాకతో సుకుమార్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇంతవరకు విడుదల చేసిన పుష్ప-2 చిత్రంలోని రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయని పలువురు అభిమానులు సుకుమార్ కు అభినందనలు తెలిపారు.

సార్వత్రిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్‌లో జూన్ 4వ తేదిన స్ట్రాంగ్ రూముల చుట్టు పక్కల పరిసర ప్రాంతాల నుంచి 2 KM వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ జి.ఆర్.రాధిక గురువారం తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరగనున్న సంగతి తెలిసిందే.

మండలంలోని కొండిపర్రు గ్రామంలో ఓ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి భరించలేక ఆటో డ్రైవర్ వెంకటేశ్ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.