India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల పోలింగ్ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు.తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ చోట్ల వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో రిలాక్స్ కోసం విహార యాత్రలకు వెళ్లారు. ఈక్రమంలో ఆయన కొత్త లుక్‌లో దర్శనం ఇచ్చారు. సాధారణంగా ఆయన ఎప్పుడూ తెల్లదుస్తుల్లో ఉంటారు. విహార యాత్రలో టీషర్టు ధరించి కళ్లజోడు పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛాయుతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలకు కాట్రేనికోన మండలం చేయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తామన్నారు.

పుట్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి క్రాస్ వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి రామలింగయ్యపల్లి గ్రామానికి చెందిన ధనాచారిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు.

జలుమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు పక్క గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఉంది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో శ్రీకాకుళం నగరంలో నివాసముంటూ కుమార్తెను చదివిస్తున్నారు. ఆ యువకుడు బాలికను మళ్లీ కలుస్తుండేవాడు. తనతో తీసుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసుదేవరావు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. 7,058 మంది విద్యార్థులకు గాను 4,310 మంది హాజరయ్యారు. 2,748 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి.రమణ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని అన్నారు.

జూన్ 12వ తేదీలోగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చేసుకోవాలని ఉప రవాణా కమీషనర్ రాజరత్నం అన్నారు. గురువారం ఉపరవాణా కమీషనర్ కార్యాలయంలో స్కూల్ బస్సుల యాజమాన్యంతో సమావేశమై మాట్లాడారు. స్కూల్, కళాశాల బస్సులలో డ్రైవర్లకు కనీసం ఐదేళ్ల అనుభవంతో పాటు 50 ఏళ్లు మించకుండా ఉండాలన్నారు. డ్రైవర్లకు విధిగా కంటి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. స్కూల్ బస్సులో తప్పనిసరిగా ఒక సహాయకుడు ఉండాలని చెప్పారు.

పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని, EC నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా పరిషత్ మందిరంలో బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు.

బాపట్ల జిల్లా నల్లమల వాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే 3 మృతదేహాలు లభ్యం కాగా <<13341655>>నాలుగో వ్యక్తి ఇంకా లభ్యం కాలేదు. <<>>ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో తహసీల్దార్ శ్రవణ్ కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో NDRF బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే బాపట్ల రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్ల ద్వారా నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఆమదాలవలస నియోజకవర్గ పరిధికి చెందిన మండలంలో గురువారం వాతావరణం నిప్పుల కుంపటిలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో భానుడి ప్రతాపం అధికం కావడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. తోపుడు బండ్లపై వ్యాపారులు, దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది. అవసరమైతే గానీ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లోని 12 స్థానాల్లో YCP-8, TDP-4 గెలిచాయి. YCP మరోసారి ఎక్కువ స్థానాలపై కన్నేయగా, TDPకి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.
Sorry, no posts matched your criteria.