India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మండలంలోని పెద్దులపల్లెకి చెందిన EX ZPTC, YCP నాయకుడు రామకృష్ణారెడ్డిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దులపల్లె పరిధిలోని ప్రభుత్వ భూమి S.NO:331లో 10 ఎకరాలను ఆక్రమించాడని పలు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూమిలో రాత్రికి రాత్రే మొక్కలు నాటడంతో గుర్తించిన MRO మహేశ్వరి బాయ్ సిబ్బందితో మొక్కలను తొలగించారు. MRO ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

జిల్లాలో పాలీసెట్ -2024 కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. బుధవారం 27,001నుంచి 43,000 ర్యాంకు మధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించగా, 336 మంది హాజరయ్యారు. వీరిలో ఓసి, బిసి 305, ఎస్సీ, ఎస్టీ 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 27 నుంచి కౌన్సిలింగ్‌కు 951 మంది హాజరయ్యారు. నేడు 43001 నుంచి 59000 ర్యాంకుల వారికి పరిశీలిస్తారు.

జిల్లాలో కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా కనీసం కిలో ధర రూ.50/- లు కంటే ఎక్కువ చెల్లించాల్సిందే. బజార్లలో కిలో పచ్చిమిర్చి ఏకంగా రూ.60/- లు వరకు పలకగా రిటైల్ షాపులలో కనీసం రూ.65/- లు నుంచి రూ.70/- ల వరకు అమ్ముతున్నారు. దీనితో సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలను చూసి కొనాలన్నా, తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.

బాపట్ల మండలంలో బుధవారం గల్లంతైన వారిలో <<13339778>>మూడో మృతదేహం లభ్యమైంది.<<>> గురువారం ఉదయం బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బోట్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో కాలువలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికి మూడు మృతదేహాలు లభించగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండు మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.

మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహిళ వయసు సుమారు 40 ఏళ్లకు పైగా ఉంటుంది అని, ఆకుపచ్చ చీర ధరించి ఉందన్నారు. గత రాత్రి మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ ఎవరు..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ధర్మవరంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన విషయం తెలిసిందే. హిందూపురం పట్టణానికి చెందిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ధర్మవరం ఒకటవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ – 2024లో నిర్వహించిన బీటెక్ 7,8 సెమిస్టర్ (స్పెషల్) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. పరీక్షల ఫలితాలకై వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in / చెక్ చేసుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం తెలిపింది.

‘పిఠాపురంలో పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారని నా యావదాస్తి పందెం వేస్తా. ఎవరైనా ఉంటే కాగితాలతో రమ్మనండి’ అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఓ ఛానల్ డిబెట్‌లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ తాము గెలుస్తున్నట్లు ఎక్కడా చెప్పడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్న విషయంపై వర్మ స్పందిస్తూ.. గెలిచే వారెప్పుడూ సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటారని, ఓడిపోయే వారే హడావుడి చేస్తారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కు సంబంధించి టెన్త్, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో అనురాధ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కెవి సుబ్బారెడ్డి తెలిపారు. పదో తరగతికి సంబంధించి 5 కేంద్రాల్లో 768 మంది అభ్యాసకులు, ఇంటర్మీడియట్‌కు సంబంధించి 7 కేంద్రాల్లో 1373 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయన్నారు

‘పిఠాపురంలో పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారని నా యావదాస్తి పందెం వేస్తా. ఎవరైనా ఉంటే కాగితాలతో రమ్మనండి’ అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఓ ఛానల్ డిబెట్‌లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ తాము గెలుస్తున్నట్లు ఎక్కడా చెప్పడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్న విషయంపై వర్మ స్పందిస్తూ.. గెలిచే వారెప్పుడూ సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటారని, ఓడిపోయే వారే హడావుడి చేస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.