India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి శేషమ్మ అన్నారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ప్రభుత్వ అధికారుల శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శేషమ్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. భీమడోలు మండలం అరుంధతీ కాలనీకి చెందిన భీమడోలు మహాలక్ష్ముడు బుధవారం ఏలూరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

వాల్తేరు డివిజన్ నౌపడ- పూండి సెక్షన్లో వంతెనల పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆరోజు శుక్రవారం పలాస-విశాఖ (07471) (07470) ప్రత్యేక మెమో పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ కోరారు.

ఇంటర్ సంప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కూర్మన్నపాలెంలోని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకులు నగదు వసూలు చేసి మాస్‌కాపీయింగ్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆ కళాశాలలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గదులను, సీసీ ఫుటేజీని పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించారు.

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వేసవి ప్రభావంతో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్తున్న ఎండకు వృద్ధులు, చిన్నారులు, ప్రజలు ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఎండ ప్రభావంతో జన సంచారం లేక ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపానికి గురి కాకుండా మజ్జిగ, మంచి నీరు, కొబ్బరినీళ్లు విధిగా తీసుకోవాలని, పనులు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కారంపూడి మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారంపూడి మండలం పెద కొదమగుండ్ల గ్రామంలో చికెన్ కొట్టు నడుపుతున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు తమ విధులను మరిచారు. మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగి కొట్టుకున్న సంఘటన వై.పాలెంలోని అర్వో కార్యాలయం వద్ద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని పరిశీలించి మద్యం పరీక్ష నిర్వహించి తాగినట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు.

సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో పొదలకూరు మండలం హాట్ టాపిక్ గా మారింది. ఈ మండలమే విజేత ఖరారులో కీలకం కానుంది. పొదలకూరు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలున్నాయి. సూరాయపాళెంతో మొదలై బ్రాహ్మణపల్లి ఈవీఎంతో ఈ మండలం కౌంటింగ్ ముగుస్తుంది. ఐదు రౌండ్ల వరకు పూర్తిగా పొదలకూరు మండలానికి సంబంధించిన ఈవీఎంల కౌంటింగే జరుగుతుంది. ఆరో రౌండ్ కు కేవలం మూడు ఈవీఎంలు మిగులుతాయి.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సమీపంలోని ధర్మవరం చెరువు రెండవ మరువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం స్థానికులు సమాచారం అందించడంతో ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఆయన ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

చుండూరు మండలం ఆలపాడుకు చెందిన చేబ్రోలు సురేంద్ర (15) ఈనెల 20న స్నేహితులతో ఆడుకుంటూ.. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంపైకి ఎక్కాడని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద గచ్చు మీద పడిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు తీవ్ర గాయమవ్వగా.. గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.