India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంచార్జ్‌గా కేజీహెచ్ గైనిక్ విభాగానికి చెందిన డాక్టర్ ఐ.వాణీకి బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేధించారంటూ కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు.

అనంతపురం జిల్లాలో చినుకులు పడితే చాలు ప్రజలు వజ్రకరూరు చేలలోకి పరుగులు తీస్తున్నారు. పొలాల్లో దొరికే రాళ్లు, వజ్రాలని అవి వారి తలరాతలు మారుస్తాయని అంటుంటారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకు వేట సాగిస్తారు. స్థానికులతో పాటు కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు బళ్లారి నుంచి కూడా వస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఏటా 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం జిల్లాలో ఏడు చోట్ల కొత్తగా కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ డీఈవో కేవీ రమణ తెలిపారు. తెట్టంగి, జామి, కోనూరు, బొండపల్లి, రామభద్రపురం, పిరిడి, ఏవీ పురం ఉన్నత పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సూరాయపాలెంలో ఇటీవల జరిగిన దారిదోపిడీ కేసులో బుధవారం భవానీపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య అనే మహిళను తాడేపల్లికి చెందిన ఎనిమిది మంది యువకులు నగదు కోసం బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కర్రలు, రాడ్లు, పోలీసు టోపీ స్వాధీనం చేసుకున్నామన్నారు.

చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎమ్, కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ వన్డే క్రికెట్లో బుధవారం నిర్వహించిన మ్యాచ్‌లో కడప, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. కడప జట్టు 310 పరుగులు చేయగా, చిత్తూరు 247 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో కడప జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది.

ఓట్ల లెక్కింపు రోజున ఉమ్మడి తూ.గో జిల్లాలో చివరి ఫలితం కొత్తపేట నియోజకవర్గం నుంచి వెలువడనుంది. 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. అత్యధిక ఓట్లు నమోదైన కొత్తపేట నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 2,52,383 మంది ఓటర్లకు గాను 2,14,975 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొత్తపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు మొత్తం 26 రౌండ్లు నిర్ణయించారు.

తనపై దాడి చేస్తారనే భయంతో భీమడోలుకు చెందిన జయరాజు మజ్జిగలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. జయరాజు ఈనెల 27న కొంతమందితో గొడవపడ్డాడు. అయితే వారు తిరిగి తనపై దాడి చేస్తారనే భయంతో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం దేనవకొండ మండలంలో జరిగింది. జిల్లేడుబుడకలలో కొండమీద లక్ష్మన్న కుమారుడు బోయ హరిచంద్రుడు(42) అప్పుల బాధ తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం చేసిన అప్పుల తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో, సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. విడవలూరు(M) వెంకటనారాయణపురం వాసి మురళీకృష్ణ స్నేహితులతో కలిసి పైడేరువాగు వంతెన వద్ద ఈతకొడుతూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇందుకూరుపేట(M), రాముడుపాలేనికి చెందిన రామయ్య,గీతల కుమార్తె భవ్యశ్రీ(12) నెల్లూరు వెంగళరావునగర్‌లో గల స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈతకొడుతూ నీటిలో మునిగిపోయింది. బాలికను సిబ్బంది బయటకుతీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.