India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మతి స్థిమితం లేని గిరిజన వ్యక్తి మరో గిరిజనుడిపై <<13338215>>బాణం<<>> వేయగా సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెడకొండ గ్రామానికి చెందిన కాకూరి బాబ్జీ అనే వ్యక్తి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. బుధవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న వంతల సోనీ(53)పై బాణంతో దాడి చేశాడు. ఛాతీపై బాణం దిగబడడంతో సోనీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు ముందు బాబ్జీ దాడిలో బూడిద గుండన్న అనే వ్యక్తి గాయపడ్డాడు.

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో బుధవారం పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గంగిరెడ్డి రామిరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న గడ్డివామిని విక్రయించి.. ట్రాక్టర్‌లో గడ్డిని లోడ్ చేస్తుండగా నాలుగు పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బెల్లంకొండ ఎస్సై రాజేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూన్ 4వ తేదీన నిర్వహించే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి 75% పూర్తయిందన్నారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రిలో అబార్షన్ అయిన వారి వివరాలు సేకరించడంతోపాటు ఎక్కడ స్కానింగ్ చేయించింది, ఎక్కడ అబార్షన్లు చేయించుకున్నారు తదితర వివరాలను కచ్చితంగా సేకరించి నమోదు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పలువురు వైద్యులు పాల్గొన్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సన్నద్ధతపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సత్యసాయి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి అంశంపైనా అవగాహన కలిగి ఉండాలని, సందేహాలుంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తూ.గో. జిల్లా రాజానగరం నియోజకవర్గ MLAగా కూటమి(జనసేన) అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలుపొందాలని జనసేన అభిమాని వివేక్ విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నాడు. ఈ మేరకు మొక్కు చెల్లించుకునేందుకు రాజానగరం నుంచి బుధవారం పాదయాత్రగా బయలుదేరాడు.

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవారం HYDలోని ఆయన స్వగృహంలో ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కాసేపు రాజకీయ అంశాలపై చర్చించారు.

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూం భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 24 గంటలూ ఈవీఎంల రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.