India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని అట్లూరులో నివాసముంటున్న యువతి(22) యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వటంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బాపట్ల మండలం యార <<13337176>>కాలువలో గల్లంతైన<<>> వారు హైదరాబాద్ కూకట్‌పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఉదయం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో గడిపి తిరుగు ప్రయాణంలో యార కాలువ నందు ఈతకు దిగి గల్లంతయ్యారు. మొత్తం ఆరుగురు కాలువలో దిగగా సన్నీ, సునీల్, కిరణ్, నందు అనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

ఓట్ల లెక్కింపు రోజున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునిల్ తెలిపారు. బుధవారం కనిగిరిలో రాజకీయ నాయకులు, ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగురవేయడం చేయరాదని స్పష్టం చేశారు.

గూడూరు మండలం చంబడిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే క్రమంలో అడ్డువచ్చిన తమ్ముడు పురిణి అశోక్‌ను అన్న క్షణికావేశంలో కర్రతో కొట్టాడు. దాడిలో గాయపడిన తమ్ముడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జూన్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుందని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్ట ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే రూ.25,000 జరిమానా, మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 6 నెలల జైలు, రూ.10,000 ఫైన్ విధిస్తామన్నారు. మైనర్లయిన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనలు మేరకు తల్లిదండ్రులకు శిక్ష తప్పదని, ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

ఇంకో ఐదు రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ తరుణంలో విజయావకాశాలపై ఎరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఇటీవల బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుస్తామని నిన్న తిరుపతిలో కోలగట్ల అన్నారు. మరి విజయనగరంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

అనంతపురానికి చెందిన హనుమంతకారి సురేశ్ రావు బుధవారం తెల్లవారుజామున గంగోత్రిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. 12 రోజులుగా ఆయన చార్‌ధామ్ యాత్రలో ఉన్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగోత్రిలోనే హనుమంతకారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబీకులు తెలిపారు.

అత్తిలి మండలం పరిధిలోని గవర్లపాలెం రైల్వే గేటు వద్ద రాకపోకలు ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం రైల్వే గేటు మూసివేస్తున్నట్లు చెప్పారు. బుధవారం నుంచి 31సాయంత్రం 7 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని కోరారు.

మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల TDP MLA అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక YSR మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.

బాపట్ల రూరల్ పరిధిలోని నాగరాజు కాలువలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి సూర్యలంక తీరానికి వచ్చిన యువకులు బాపట్ల అప్పికట్ల రహదారిలో ఉన్న యార కాలువలో ఈత కోసం దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.