India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జూన్ 4వ తేదీన జిల్లాలోని మద్యం దుకాణాలను మూత వేయడంతో పాటు కల్లు విక్రయాలను నిలిపివేయనున్నారు. ఆ రోజు పూర్తిగా డ్రైడేగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖలో 2017లో సంచలనం రేపిన కిడ్నాప్, రేప్ కేసులో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆనంది మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు గణేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

గర్భిణులు పొందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా మాతృ, శిశు మరణాలు సమీక్ష ఉప కమిటీ చైర్మన్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మార్చి, ఏప్రిల్ నెలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.

కౌటింగ్ పక్కాగా జరగాలని, ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేసే సిబ్బంది, అలాగే వాటిని క్రాస్ చెక్ చేసే మరో బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సిబ్బందితో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు.

అనంతపురము నగరంలోని కలెక్టరేట్‌లోని మినీ హాలులో మంగళవారం రెండవ రోజు ఎంపీ అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల నియామకం & విధులపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నేడు (బుధవారం) పాలీసెట్-2024లో 27,001- 43,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని కౌన్సిలింగ్ నిర్వాహకులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.

ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చి 15 రోజులైంది. మరో 6 రోజుల్లో నేతల భవితవ్యం వెలువడనుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థే MLA అంటూ వాహనాలకు ముందస్తుగానే స్టిక్కర్లు అతికించేస్తున్నారు. మరోవైపు బెట్టింగుల జోరు నడుస్తోంది. – మీ వద్ద పరిస్థితి ఏంటి.?

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చి 15 రోజులైంది. మరో 6 రోజుల్లో నేతల భవితవ్యం వెలువడనుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ అభ్యర్థే MLA అంటూ వాహనాలకు ముందస్తుగానే స్టిక్కర్లు అతికించేస్తున్నారు. మరోవైపు బెట్టింగుల జోరు నడుస్తోంది.
– మీ వద్ద పరిస్థితి ఏంటి.?

ఈవీఎం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ కంట్రోల్ యూనిట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల సీరియల్ నంబర్ వారీగా ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు బాధ్యతగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.