India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1982 ఆగస్టులో ఎన్టీఆర్ నరసన్నపేట వచ్చారు. చైతన్యరథంపై ప్రచారం చేపట్టారు. కార్మికుడి డ్రెస్ వేసుకుని.. లక్ష్మీథియేటర్ సెంటర్లో ఉపన్యాసాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు పేట వాసులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రచార సభ అనంతరం.. ఎన్టీఆర్ నరసన్నపేట నుంచి తామరాపల్లి మీదుగా కోటబొమ్మాళి మండలం సుబ్బారాయుడుపేట వద్ద శివాలయంలో రాత్రి బస చేశారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీలను సీఎస్ జవహర్ రెడ్డి అండ్ కో భయపెట్టి రూ.వేల కోట్ల విలువ చేసే భూములను దోచుకున్నారని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయమై తాను ఆరోపణలు చేసి 72 గంటలు అయినా సీఎస్ నుంచి సరైన సమాధానం లేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది భారీ భూ కుంభకోణంగా పేర్కొన్నారు.

నరసాపురంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో మంగళవారంఆల్ ఇండియా ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీ ప్రారంభమైంది. పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త నూలి శ్రీనివాస్ ఏడేళ్లుగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి రూ.64 వేల నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేయనున్నారు.

సంబల్పూర్ కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. వచ్చే నెల 17, 24 (2 ట్రిప్పులు) తేదీల్లో నడపనున్న సంబల్పూర్ కాచిగూడ రైళ్లను రద్దు చేసామన్నారు. అలాగే కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను వచ్చే నెల 18, 25(రెండు ట్రిప్పులు) తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ఆక్యుపెన్సి కారణంగా వీటిని రద్దు చేశాయన్నారు.

వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్‌సీ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్ విడుదల చేశారు. వైవీయూలోని తన ఛాంబర్‌లో కులసచివులు ప్రొ. వై.పి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలించారు. బీఏ, బీబీఏలో 100 శాతం పాసయ్యారని, బీకాంలో 98.38 శాతం, బీఎస్సీలో 98.93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

చిత్తూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. చిత్తూరులో కౌంటింగ్ పర్యవేక్షకులు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు.

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 1300 మంది సూపర్‌వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్‌లను నియమించినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి 19 రౌండ్లు, పాతపట్నం 24, ఇచ్ఛాపురం 22, పలాస 21, టెక్కలి 23, శ్రీకాకుళం 20, ఎచ్చెర్ల 23, నరసన్నపేట 21 రౌండ్లుగా లెక్కింపు జరగనుంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక కోరారు. విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్ధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

లేపాక్షి మండలం చోళసముద్రంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను మంగళవారం కలెక్టర్/హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి తగు జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రాజమ్మ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కుమార్ తన తల్లిని కలిసేందుకు సమీపంలో ఉన్న జీడి పరిశ్రమకు సోమవారం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెబుతూ తన వెంట ద్విచక్ర వాహనంపై తీసుకుపోయాడు. పలాస రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న సమయంలో బాలుడు బిగ్గరగా ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు ప్రశ్నించడంతో బాలుడును వదిలి వెళ్లాడు.
Sorry, no posts matched your criteria.