India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలిసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కింది ధ్రువపత్రాలు తెచ్చుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లించిన రసీదు, పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, SSC మార్కుల జాబితా, 4-10 తరగతుల స్టడీ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్స్, EWS వర్తించే వారికి సంబంధిత ధ్రువపత్రాలు, ప్రత్యేక కేటగిరి నిర్ధారించే ధ్రువపత్రాలు తీసుకొని రావాలన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం నందరాజనపల్లిలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న బాలికను సోమవారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దీంతో నాలుగో తరగతి చదువుతున్న ఖుషీ అనే తొమ్మిదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షా ఫీజు చెల్లించడానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ లోపు పరీక్షా ఫీజు చెల్లించాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. జూన్ 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు.

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ శామ్యూల్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 930 మంది, ఇంటర్ పరీక్షలకు 1,265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రతిరోజు పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావుపేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది.

జిల్లా వ్యాప్తంగా మంగళవారం భానుడి ప్రతాపం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ 11 గంటల సమయంలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు ఉక్కపోత తోడవ్వడం సాధారణ జనజీవనానికి ఒకింత ఆటంకంగా ఏర్పడింది. పది, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, వారి సహాయకులు ఎండ తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు విధిస్తామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో వివిధ హోటళ్లు, బేకరీల ప్రాంగణాలను తనిఖీ చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలను పాటించని వివిధ దుకాణాలకు 10 వేల రూపాయల జరిమానాలు విధించి, కొన్ని దుకాణాలను మూసివేశారు.

ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ రోజు రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పల్నాడు కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ రావు, ఎస్పీ మలికా గర్గ్, జేసీ శ్యాంప్రసాద్, డీఆర్వో వినాయకం, తదితరులు పాల్గొన్నారు.

ఎంసెట్ లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ(19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె కీ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

జామి వాటర్ ఫాల్స్‌లో గల్లంతైన విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన<<13330025>> ముగ్గురు <<>>యువకులలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకొకరి కోసం APSDRF బృందాల చేత గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తమ పిల్లల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.యువకుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.