India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SBI కదిరి వ్యవసాయ శాఖ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రూ.1.50 కోట్లకు పైగా నగదును ఇతర ఖాతాలకు మళ్లించి తాను వాడుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో SBI రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చిలో ఆయనపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

నెల్లూరు: ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు గుడివాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ స్థాపన అనంతరం జరిగిన 1983, 85 ఎన్నికలలో ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించారు. అనంతరం ఆయన స్మారకార్థం గుడివాడలో ఎన్టీఆర్ పేరు మీద స్టేడియం నిర్మించారు. రెండు సార్లు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన గుడివాడ గురించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా చెబుతుండేవారు. నేడు ఎన్టీఆర్ జయంతి.

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో తొలి రోజు 1 నుంచి 12 వేల లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం 12,001 నుంచి 27,000 వరకు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది.

ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు.

‘ఈసారి కూడా కచ్చితంగా ఆయనే గెలుస్తాడు. లేదు లేదు ఈసారి తప్పక గెలుపు ఇతనిదే.’ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పల్లెలను మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా ప్రజల నోట వినిపిస్తున్న మాటలివి. సరిగ్గా ఇవాల్టి రోజే (JUN-4)న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు/DEOలు కౌంటింగ్ నిర్వహణ కోసం చర్యలు చేపడుతున్నారు. మరి మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిని వరించేనో కామెంట్ చేయండి.

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అనంతరం తొలి మంగళవారం ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తుంది. ఉదయం గంగమ్మకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం టెంకాయలతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. జాతర తరువాత ఐదు వారాల పాటు మారు పొంగళ్లు పేరుతో అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తొలి వారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు.

జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ విధానం సోమవారం నుంచి అమలులోకి తెచ్చినట్లు కారాగారం పర్యవేక్షకుడు ఎస్.కిషోర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే జైలుకి వచ్చి జైలు నిబంధనలు మేరకు మాట్లాడే అవకాశం ఉండేది. దూరం నుంచి రావటం.. సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఖైదీల కుటుంబ సభ్యులకు భారమవుతుందనే ఉద్దేశంతో ఈ విధానం అమల్లోకి తెచ్చారు.

జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామంలో మనుషులపై దాడి చేసి చంపిన<<13322804>> కుక్కలను<<>> గ్రామస్థులు వేటాడుతున్నారు. నాలుగు కుక్కలు 15 రోజుల ముందు బంటు. లక్ష్మీ అనే వృద్ధురాలిపై, నిన్న నీరస. శంకర రావు అనే వ్యక్తిపై దాడిచేసి చేయగా వారు మృతిచెందారు. దీంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు చర్యలు ముమ్మరం చేయలేదంటూ వారే ఒక కుక్కను చంపారు.

నందమూరి తారకరామారావు తన రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు టెక్కలిలో పర్యటించారు.1983లో టెక్కలిలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో పర్యటించారు. 1987లో టెక్కలిలో కరువు సంభవించడంతో పర్యటించారు. 1988లో వంశధార కాలువ నీరు నిలిచిపోవడంతో పర్యటించి సమస్య పరిష్కరించారు. 1994లో టెక్కలిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 1995లో రూ.10కోట్లతో ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.
Sorry, no posts matched your criteria.