India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో సిజేరియన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. WHO సంస్థ ప్రకారం 15 శాతం వరకు సిజేరియన్లకు అవకాశం ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య 50పైనే ఉంటుంది. 2023-24లో ప్రభుత్వ ఆసుపత్రిలో 10,890 ప్రసవాలు జరగ్గా అందులో 4,916 సిజేరియన్లే. అదే ప్రైవేట్ ఆస్పత్రిలో 22,667 ప్రసవాలు జరగ్గా ఏకంగా 14,346 మంది తల్లుల కడుపును డాక్టర్లు కోశారు. కొన్ని ఆస్పత్రిల్లో ఈ సంఖ్య 80 శాతంపైనే ఉంటోంది.

కోనసీమ జిల్లాలో తొలి ఫలితం రాజోలు నియోజకవర్గంలో వెలువడనుంది. అనంతరం అమలాపురం రూరల్ మండలం, పాలగుమ్మి, బండారులంక నుంచి ప్రారంభమవుతుంది. పి.గన్నవరంలోని ఆదుర్రు, రామచంద్రపురంలోని కొత్తూరు, ముమ్మిడివరంలోని గురజాపులంకలో వెలువడనున్నాయి. తర్వాత కేశవరం, మండపేటతో ఓట్ల లెక్కింపు ముగియనుంది.

ఏప్రిల్ 13న విజయవాడలో జగన్‌పై గులకరాయి దాడి కేసు విచారణలో భాగంగా నేడు తీర్పు రానుంది. ఈ కేసు విచారిస్తున్న విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కేసు విచారణలో భాగంగా అరెస్టైన సతీశ్‌ను అక్రమంగా ఇరికించారని అతడి తరఫు లాయర్ సలీం కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ సతీశ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.

టంగుటూరు మండలం తేటుపురంలోని పాలేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి బ్లూ రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈమె తయారు చేసింది. ఈ కళానైపుణ్యానికి పూర్వి రజాక్ పేరును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పొందుపరిచారు.

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 15 అసెంబ్లీ, 2 MP స్థానాలు గెలుచుకోగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

పొందూరు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై 24 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి మామిడి పండు ఆశ చూపి తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లికి చెప్పడంతో బంధువులు యువకుడికి దేహశుద్ధి చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నంద్యాల జిల్లా చాగలమర్రి సమీపంలోని వక్కిలేరు వాగుపై బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిని కూలిపోవడంతో రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ రహదారిలో ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున అధికారులు చర్యలు చేపట్టి రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.

బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులు కేశవ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఫలితాల కోసం జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు అన్ని ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.