India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడపలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సౌత్ జోన్ అంతర్ జిల్లా సీనియర్ వన్డే క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జట్టుకు గిరినాథ్ రెడ్డిని కెప్టెన్‌గా నియమించారు. ఈయన రంజీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా పాల్గొంటుందని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి తెలిపారు.

కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, రాజేశ్, రాధాప్రియ, స్వామి నాథన్ అన్న కుమారుడు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్ 15 ఏళ్ళ క్రితం కుటుంబంతో వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. కుమారుడు రాజేశ్, కూతురు రాధ తమిళనాడులో చదువుతున్నారు. వేసవి సెలవులకు కొవ్వూరు వచ్చిన వీరు తిరిగి సోమవారం కారులో తమిళనాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు నూతనంగా రెండు కోర్సులు మంజూరైనట్లు వైస్ ఛాన్సలర్ హుసేన్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌కు అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషిన్ లర్నింగ్, కంప్యూటర్ సైన్సు డేటా కోర్సులకు ఏఐసీటీఈ అనుమతించిందని తెలిపారు. ఒక్కొక్క కోర్సుకు 60 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

బాడంగి మండలం బ్రహ్మన్నవలస గ్రామ శివారులో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.16,400 స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ జయంతి సోమవారం నాడు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు టెక్కలితో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడిగా 1994లో జరిగిన ఎన్నికల్లో ఆయన టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టెక్కలి పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం అప్పట్లో టెక్కలికి ప్రాంతీయ ఆసుపత్రిని మంజూరు చేశారు. పట్టణంలోని పాత జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఒక మహావృక్షం ఎన్టీఆర్ గుర్తుగా ఉంది. నేడు ఆయన జయంతి.

పి.గన్నవరం మండలంలోని యర్రం శెట్టివారిపాలెంలో అడబాల రంగారావు తోటలో ఒక పనసచెట్టుకు 75.200 కేజీల బరువుతో పనసకాయ కాసింది. దానిని అంబాజీపేట మార్కెట్ కు తరలించారు. ఈ బరువైన పనసకాయను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రూ.7 వేలకు పైబడి కొనుగోలు చేస్తారని స్థానిక వ్యాపారులు తెలిపారు.

జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలో తొలి ఫలితం నందిగామ నుంచి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 4 గంటల్లోనే ఇక్కడ విజేత ఎవరో తేలిపోనుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నిమ్రా, నోవా కాలేజీల్లో లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.

సంగం మండలంలోని ఓ బాలికను ఆటో డ్రైవర్ రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు షేక్ బాదుషా అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేది. కాగా వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న అతను.. బాలికపై కన్నేసి తన ఆటోలో పక్కనే కూర్చొబెట్టుకుని అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యకరకంగా ప్రవర్తించేవాడు. చివరికి వివాహం చేసుకునే కుట్రకు పాల్పడ్డాడు.

కరెంట్ షాక్‌తో నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన కురిచేడు మండలంలో సోమవారం జరిగింది. గంగదొనకొండ గ్రామంలో గోదాల సుబ్బారెడ్డి, కర్నాటి పెద్ద వెంకటరెడ్డి, బెండయ్య గేదెలు పొలాల్లో గడ్డి తింటుండగా మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పొలాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గేదెలు వాటిని తగలండంతో నాలుగు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మందిని సస్పెండ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ సోమవారం పేర్కొన్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, కొందరు రాతపూర్వక సంజాయిషీ ఇచ్చారని తెలిపారు. సంతృప్తికర సమాధానం ఇవ్వని సిబ్బందిని ఎన్నికల నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.