India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వేంపల్లిలో సోమవారం విషాదం నెలకొంది. కడప రోడ్డులో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరు మనోజ్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కారుకు నీటితో సర్వీసింగ్ చేస్తుండగా పొరపాటున నీరు మోటార్‌పై పడి మనోజ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. ఐదు రోజుల్లో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సోమవారం గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాసరావుపేటలో లత అనే మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తోంది. సోమవారం సీఐ మధుసూదన్ రావు ఆ ఇంటిపై తనిఖీలు చేసి ఇద్దరు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

బాపట్లలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. బాపట్లలోని కలెక్టరేట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు కూడా శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.

ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ, కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్వతీపురం జిల్లా ఎస్పీ విక్రాంత్ ఈ పాటిల్ ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ ఆర్మర్డ్ రిజర్వుడు, స్పెషల్ పార్టీ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ సోమవారం నిర్వహించారు. జూన్ 4న, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాబ్ డ్రిల్ నిర్వహించారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున శాంతియుతంగా ఉండాలని కోరారు.

జూన్ 4తేదిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఇరువురు సందర్శించారు. అనంతరం కౌంటింగ్ రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రత ఏర్పాట్లును పరిశీలించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు.

జూన్ 4వ తేదీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం సమీపాన గల బిట్ కళాశాల, లేపాక్షి మండలంలోని చోళ సముద్రం వద్ద కల అంబేద్కర్ పాఠశాలలో జరుగు ఓట్ల లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈవీఎంల లెక్కింపు కొరకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు గదులలో సీసీ కెమెరా, వీడియోగ్రఫీ నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.

ఏలూరు జిల్లా కేంద్రంలోని సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను SP మేరీ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.

కడప జిల్లాకు సంబంధించి ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు భద్రతపై సిబ్బందితో చర్చించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జూన్ 4 వరకు బందోబస్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.