India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎస్పీ తుషార్‌తో కలిసి స్ట్రాంగ్ రూంలో భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని మీనా తెలిపారు.

నెల్లూరు: పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేది ప్రియదర్శిని కాలేజీలో జరుగుతుందన్నారు.

చిత్తూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, పటిష్ఠంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రేపు మంగళవారం పాలీసెట్-2024లో 12,001- 27,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

జూన్ 4న ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. నేడు నిమ్రా కళాశాలలో కలెక్టర్ ఢిల్లీ రావు, సీపీ రామకృష్ణతో కలిసి స్వయంగా స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మీనా మాట్లాడుతూ.. కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు సలహాలు జారీ చేశారు.

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ నాగరాణి తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమవ్వగా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి, ఆమదాలవలస, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో 780 సీట్లు ఉన్నాయన్నారు.

ఆచార్య నాగార్జున వర్సిటీ(డిస్టెన్స్) 2024 ఫిబ్రవరి- మార్చిలో నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలు నేడు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు డిప్లొమా కోర్సులు(ఇయర్ ఎండ్), డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సుల(సెమిస్టర్ ఎండ్) ఫలితాలు నేడు విడుదల చేశామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఫలితాలకు http://www.anucde.info/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ ట్యాబ్ చూడాలని సూచించాయి.

కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. డ్రై రన్ అనంతరం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అందరూ కౌంటింగ్ అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. తప్పిదాలు జరగరాదని స్పష్టం చేశారు. ఆర్ఓ, ఎంఆర్ఓ పక్కాగా కచ్చితత్వంతో ఉండాలన్నారు.

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. మీడియా సెంటర్, కౌంటింగ్ ఏజెంట్ల భోజన ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.

మైదుకూరు మండల పరిధిలోని కేశలింగయ్య పల్లె వద్ద సోమవారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామానికి చెందిన సుంకర కొండయ్య(55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయం తగిలి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.