India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలీసెట్ కౌన్సెలింగ్ హాజరయ్యే అభ్యర్థులు కింది ధ్రువపత్రాలు తెచ్చుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. * ఆన్‌లైన్ ఫీజు చెల్లించిన రసీదు * పాలీసెట్ హాల్ టికెట్,ర్యాంక్ కార్డు * SSC మార్కుల జాబితా * 4- 10 తరగతుల స్టడీ సర్టిఫికెట్/ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ * EWS వర్తించే వారికి సంబంధిత ధ్రువపత్రాలు * ప్రత్యేక కేటగిరిని నిర్ధారించే ధ్రువపత్రాలు.

జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లను జూన్ 4న కృష్ణా విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూమ్‌లను కేటాయించారు. రూమ్ నం.301Aలో గన్నవరం, రూమ్ నం.101Aలో గుడివాడ, రూమ్ నం.134Aలో పెడన, రూమ్ నం.118Aలో మచిలీపట్నం, రూమ్ నం.322Bలో అవనిగడ్డ, రూమ్ నం.129Aలో పామర్రు, రూమ్ నం.201Aలో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నారు.

సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో సోమవారం ఆటో బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఆటోలో 18 మంది గిరిజనులు ప్రయాణిస్తుండగా బోల్తా పడటంతో సవర కార్తీక్(10) అనే అబ్బాయి మృతి చెందాడు. ప్రయాణికులంతా సీతంపేట సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఏడుగురిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకెళ్లారు.

తణుకు పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పట్టణ SI శ్రీనివాస్ తెలిపారు. పట్టణానికి చెందిన చదలవాడ తిమోతి అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో వారు కేసునమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

పర్చూరు మండలంలో నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు రూ.8కు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం పర్చూరులో 30 గుడ్ల ధర రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతోంది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎస్పీ తుషార్‌తో కలిసి స్ట్రాంగ్ రూంలో భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని మీనా తెలిపారు.

ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాల, JNTU కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రాజకీయ పార్టీల ఏజెంట్లు సులువుగా ఆయా నియోజక వర్గాల లెక్కింపు జరిగే ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా తెలుగులో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు.

ఎన్నికల కమిషనర్ నిబంధనలు పాటిస్తూ.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఢిల్లీరావు ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్‌కి వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో సజావుగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఓట్ల లెక్కింపుపై సంబంధిత ఎన్నికల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్సిటీని సందర్శించనున్నారన్నారు.

చిట్వేలిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కొద్ది గంటల క్రితం ఓ కారు, బైక్‌ను<<13327396>> ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిట్వేలి పోలీసులు విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.