India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 502 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లో భాగంగా 2,602 సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం, 23 మంది రౌడీ, సస్పెక్ట్ షీటర్లు అరెస్ట్ చేశామని అన్నారు. 307 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.

కడుపు నొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామంలో గోయన్న గారి హేమలత(16) ఉదయం 10:30 గంటల ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి పై కప్పుకు కరెంటు వైర్‌తో ఉరివేసుకుంది. పనికి వెళ్లి ఇంటికి వచ్చిన అమ్మమ్మ పద్మావతమ్మ చూసి చుట్టుపక్కల వారిని పిలిచి ఆటోలో వైద్యశాలకు తరలించారు. బాలిక మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వెల్డింగ్ పని చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కనేకల్లు మండలంలోని ఆదిగానిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బడిగే శ్రీనివాసులు (55) సోమవారం మధ్యాహ్నం వ్యవసాయం పనిముట్లు వెల్డింగ్ పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఫలితాలపై ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎడతెగని టెన్షన్ నెలకొంది. మరో వారం రోజుల్లోనే ఓటర్ తీర్పు బహిర్గతం కానుంది. ఈక్రమంలో జిల్లాలో ఏ మూల చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. సిటీలో కన్నా గ్రామాల్లో రచ్చబండలపై అందరూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చూడలి మరి.

కొత్తవలస మండలం అడ్డురువానిపాలెం వద్ద గుర్తు తెలియని సుమారు 20నుంచి 25 సంవత్సరాలమధ్య ఉన్న యువకుడు మృతదేహం లభ్యమైంది. మృతుడు మోచేతికి బుబిలి నల్లనీ పచ్చబొట్టు ఉంది. కుడిచేతి మండపైన కిరీటం పచ్చబొట్టు కలదు. మృతుడు నలుపు, తెలుపు చెక్స్ కలిగిన ఫుల్ హాండ్ షర్ట్, నల్లని కాటన్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఆచూకీ తెలిసినవారు విజయనగరం పోలీసులకు ఫోన్ల్ (9490617089, 9440591331) తెలియజేయాలని కోరారు.

ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ సోమవారం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు లేని 26 ద్విచక్ర వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు ఆయా మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వాహన పాత్రలు లేని 26 ద్విచక్ర వాహనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కౌంటింగ్ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ సామాన్య ప్రజలకు, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక్కరోజే 266 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం కొవ్వూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన యాదగిరి నూకమ్మ (70)ను వాటర్ ట్యాంక్ సమీపంలో జేసీబీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న కొవ్వూరు టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, ఎమ్మిగనూరుకి చెందిన బైలుప్పల షఫీయుల్లాకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే వేడుకల్లో అవార్డు అందుకోనున్నారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కళా రంగానికి సేవ చేస్తున్న తమను టీడీపీ గుర్తించిందన్నారు.

నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఆటో బోల్తా పడింది. కడపకు చెందిన కరీమున్నీసా మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇవాళ ఒక్కో రోజే అనంతసాగరం, ఏఎస్ పేట, సైదాపురం, మనుబోలు మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోగా.. చంద్రగిరి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామస్థులు నలుగురు కన్నుమూశారు.
Sorry, no posts matched your criteria.