Andhra Pradesh

News May 27, 2024

శృంగవరపుకోట: ప్రమాదశాత్తు గీత కార్మికుడి మృతి

image

శృంగవరపుకోట మండలం గోపాలపల్లి గ్రామానికి చెందిన వనం సంతోశ్(36) ఆదివారం సాయంత్రం కల్లు తియ్యడానికి ఈత చెట్టు ఎక్కుతుండగా ప్రమాదశాత్తు జారిపడి కిందపడి పోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ సోమవారం తెలిపారు.

News May 27, 2024

కడప: పది సప్లిమెంటరీ పరీక్షకు 368 మంది గైర్హాజరు

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈరోజు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు కడప జిల్లాలో 16 సెంటర్లలో మొత్తం 247 మంది పరీక్షలకు హాజరయ్యారని విద్యా శాఖ అధికారి అనురాధ తెలిపారు. 615 విద్యార్థులకు గాను 368 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. 40.16% హాజరు కాగా, గైర్హాజరు శాతం 59.84% ఉందన్నారు. 02 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 08 సెంటర్లను పరిశీలించారన్నారు.

News May 27, 2024

తాడేపల్లి: అప్పులు తీర్చలేక విద్యార్థి ఆత్మహత్య

image

లోన్ యాప్‌లో రుణం తీసుకొని, దాన్ని తీర్చలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన వంశీ(22) యాప్‌లో రుణం తీసుకొని క్రికెట్ బెట్టింగులు పెట్టాడు. తిరిగి చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి నేపథ్యంలో, తల్లిదండ్రులకు చనిపోతున్నట్లు మెసేజ్ చేసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

చిత్తూరు: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇలా చేయండి

image

చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, ఘర్షణలకు పాల్పడుతున్నా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు గాని, డయల్ 100/112 నెంబర్లకు గాని, పోలీస్ WhatsApp నెంబర్ 9440900005 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

News May 27, 2024

ఎర్రగుంట్ల: లారీ, బైకు డీ.. మహిళ మృతి

image

ఎర్రగుంట్ల మండల పరిధిలోని కడప-తాడిపత్రి జాతీయ రహదారి రాణివనం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రగుంట్ల మండలం, రాణివనంకు చెందిన ఆరీఫ్ తన తల్లితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరీఫ్ తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఆరీఫ్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

కౌంటింగ్ ప్రక్రియపై సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ కొండయ్యతో పాటు పలువురు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథితో పాటు పలువురు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు పాల్గొన్నారు.

News May 27, 2024

మృతులు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తింపు

image

చంద్రగిరి సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు <<13322392>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతులు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురానికి చెందిన సమీ, శేషయ్య, పద్మమ్మ, జయంతిగా గుర్తించారు. తిరుమల దర్శనం అనంతరం కాణిపాకానికి బయల్దేరారు. మార్గమధ్యలో డివైడర్‌ను ఢీకొట్టి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో నలుగురు చనిపోయారు. ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

News May 27, 2024

పార్వతీపురం: పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తూ రైల్లో మృతి

image

పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తూ వ్యక్తి రైల్లో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెందుర్తి నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన రాళ్లపల్లి సత్యనారాయణ (63) తన భార్యతో పుణ్యక్షేత్రాలకు వెళ్లి సమతా ఎక్స్ ప్రెస్‌లో తిరిగి వస్తుండగా టిట్లాగర్ వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యారు. అక్కడ దిగి చికిత్స అనంతరం నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం అవుతుండగా పార్వతీపురం సమీపంలో గుండెపోటుతో మృతి చెందారు.

News May 27, 2024

కడప: గండికోట అందాలు అదరహో

image

కడప జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, ఎందరో పర్యాటకులను మనవైపు చూసేలా చేసింది మన గండికోట. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు, మూడు వైపుల పెన్నా నది లోయ, అబ్బుర పరిచే శిల్ప సంపద, రాజులు, రాజ్యాల వైభవం గండికోట సొంతం. వర్షాలు పడేకొద్దీ గండికోట అందాలు మరింత ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం కొద్ది వర్షపాతానికే గండికోట పరిసర ప్రాంతాలు పచ్చగా మారాయి. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

News May 27, 2024

సీతంపేటలో లోయలో పడిన ఆటో..వాహనంలో 17మంది

image

సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి సమీపంలో సోమవారం సంత ముగించుకొని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలో ఉన్న 17 మందికి తీవ్ర గాయాలవ్వగా.. హుటా హుటిన సీతంపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.