India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులోని అజ్జాలమ్మ గుడి సమీప మలుపులో సోమవారం లారీ ఢీకొని పీతల నందమ్మ(75) మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమ్మ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

చెల్లని పోస్టల్ బ్యాలెట్, నోటా ఓట్లపై ఉమ్మడి తూ.గో జిల్లాలోని ప్రధాన అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. కాకినాడ జిల్లాలో చూస్తే 2019లో నోటా, చెల్లని పోస్టల్ ఓట్ల వివరాలు వరుసగా ఇలా..
☞ పిఠాపురం-2339, 271
☞ కాకినాడ సిటీ-1654, 15
☞ కాకినాడ గ్రామీణ-1575, 868
☞ తుని-2586, 178
☞ ప్రత్తిపాడు-2079, 117
☞ పెద్దాపురం-2072, 206
☞ జగ్గంపేట-3016, 163

పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోల్లో దొర్లిన పొరపాట్లను సవరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల మెమోల్లోని తప్పులు, పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని డీఈవో సుభద్ర చెప్పారు. తప్పుల సవరణకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలోని మాణిక్యాంబ 9919510766 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు సోమవారం పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరూ కూడా ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించరాదని సూచించారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో ఇద్దరు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో నీరస శంకర్రావు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సీమనాయుడువలసకు చెందిన సిర శంకర్రావు గాయాలుపాలై చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. కుక్కల దాడుల్లో ఇప్పటికే అనేక మందికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఇద్దరు చనిపోయినా.. అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

కడపలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేపై దాడి, కడప, మైదుకూరులో జరిగిన అల్లర్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కడప రిమ్స్ సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పారా మిలిటరీ సిబ్బంది పహారా కాస్తున్నారు. మూడెంచెల భద్రతతో, 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లను డీజీపీ నియమించారు.

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 290 మందికి రూ.75,980 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 23 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

బొండపల్లి మండలంలోని అంబటివలస-గొట్లాం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను ఢీకొని విజయనగరం మండలం గుంకలాంకి చెందిన తాడ్డి తాతబాబు (35) మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తాతబాబు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామన్నారు.

నెల్లూరు రూరల్, కోవూరు డివిజన్ లలో డి.పి.ఈ. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో అక్రమ విద్యుత్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రొయ్యల గుంటలకు అక్రమ విద్యుత్ వాడుతున్న వారిపై రాత్రి దాడులు నిర్వహించారు. రైడ్స్ లో విద్యుత్ డి.పి.ఈ. విభాగం, ఏ.పి.టి.ఎస్.సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వారి సిబ్బంది పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల వరకు జరిమానా విధించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశామని జగ్గంపేట ఎంపీడీవో వసంత్ కుమార్ తెలిపారు. జగ్గంపేట ఫీల్డ్ అసిస్టెంట్ గొల్లపల్లి రత్నరాజు, సీనియర్ మేట్ రెడ్డి భానుప్రతాప్ ఎన్నికల కోడ్ అతిక్రమించి వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆర్వోకు ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై డ్వామా అధికారులకు నివేదిక పంపించగా.. ఆ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.