Andhra Pradesh

News May 27, 2024

శ్రీకాకుళం: జూన్ 10 నుంచి పాలిటెక్నిక్ తరగతుల ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2,591 సీట్లు ఉన్నాయి. మే 27వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. జూన్ 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి. జూన్ 7న సీట్ల కేటాయింపులు వివరాలను పాలిసెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. జూన్ 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

News May 27, 2024

ప.గో: ALERT.. మామిడి పండ్లు తింటున్నారా..?

image

పండ్ల రారాజైన ‘మామిడి’కి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉండటంతో ఉమ్మడి ప.గో జిల్లాలో దళారులు అక్రమ మార్గాలకు తెరదీస్తున్నారు. కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలతో కాయలను మగ్గబెడుతున్నారు. ఇలాంటి ఆరోపణలున్నా అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. కెమికల్స్‌తో మగ్గబెట్టిన పండ్లు తింటే క్యాన్సర్, అల్సర్, కాలేయ వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు నీటితో పండ్లు కడితే మేలని సూచిస్తున్నారు.

News May 27, 2024

మచిలీపట్నం: జనసేన నేత కారు దగ్ధం కేసులో దర్యాప్తు వేగవంతం

image

మచిలీపట్నానికి చెందిన జనసేన నేత కర్రి మహేశ్ కారు దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందా.? లేక రాజకీయ ప్రేరేపితం ఉందా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ(64) హైదరాబాద్ లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ప్రకాశం పంతులుకు ఇరువురు కుమారులు. వారిలో హనుమంతరావు ఒకరు కాగా.. హనుమంతరావు కుమారుడు గోపాలకృష్ణ సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ప్రకాశం పంతులు కుటుంబంలో దీనితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 27, 2024

ప్రకృతి సంరక్షణతోనే సుఖమయ జీవితం: రామ్, లక్ష్మణ్

image

మనం ప్రకృతిని సంరక్షించుకుంటే సంతోషకరమైన జీవితం పొంద వచ్చని సినీ ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం నార్పలకు వచ్చిన వారు.. ద్యానమందిర కేంద్రంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ పొలం గట్లు, ఇళ్ల ముందు, రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పక్షులకు, మూగజీవాలకు ఆహారంతో పాటు నీరు అందించాలన్నారు.

News May 27, 2024

విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్టు

image

నిరుద్యోగులను కంబోడియాకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించగా గాజువాకకు చెందిన ఏజెంట్ కె.వీరేంద్రనాథ్ 17 మందిని కాంబోడియాకు పంపించినట్లు గుర్తించారు. వీరేంద్రనాథ్‌తో పాటు మరో ఏజెంట్ కె.ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

News May 27, 2024

పార్వతీపురం: కుక్కల దాడిలో మరో వ్యక్తి మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లాలో కుక్కల దాడిలో మరో వ్యక్తి మృతి చెందాడు. <<13322735>>జియ్యమ్మవలస<<>> మండలం బిత్రపాడుకు చెందిన నీరస శంకర్రావు (40) బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో కుక్కలు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందు మృతి చెందాడు. కాగా కొద్దిరోజుల క్రితమే వెంకటరాజపురానికి చెందిన ఓ వృద్ధురాలు కుక్కలదాడిలో మృతి చెందింది.

News May 27, 2024

విశాఖ: నేటి నుంచి కౌన్సిలింగ్.. ఇవి మర్చిపోవద్దు

image

పాలీసెట్ కౌన్సిలింగ్ నేటి నుంచి జూన్ 3 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.
➣ ప్రాసెసింగ్ ఫీజు రశీదు
➣ పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
➣ పది, తత్సమాన మార్కుల జాబితా
➣ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
➣ EWS కోటా అభ్యర్థులు సంబంధిత EWS సర్టిఫికేట్
➣ 1-1-2021 తర్వాత నాటి కుల, ఆదాయ సర్టిఫికేట్
➣ టీసీ
➣➣Share it

News May 27, 2024

కాకినాడ: UPDATE.. రోడ్డుప్రమాదం.. మరొకరు మృతి

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ <<13321598>>ప్రైవేట్ బస్సు కారును<<>> ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయాడు. ఇతర వాహనదారులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది.

News May 27, 2024

ప్రకాశం: బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం కంబంపాడు గ్రామానికి చెందిన పరోపోగు జయపాల్ (32) బైకుపై త్రిపురాంతకం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో దూపాడు వద్ద బైకుసు కుంట వైపు నుంచి వినుకొండవైపు వెళుతున్న లారీ ఎదురుగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వినుకొండకు తరలిస్తుండగా మృతి చెందాడు. లారీ డ్రైవరును ఎస్సై సాంబశివయ్య అదుపులోకి తీసుకున్నారు.