Andhra Pradesh

News May 27, 2024

ప్రకాశం: తగ్గిన నిమ్మ ధరలు.. కిలో రూ.5

image

జిల్లాలో నిమ్మధరలు వారం రోజులుగా భారీగా పడిపోయాయి. కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోయింది. దీంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. కనిగిరి కమీషన్ మార్కెట్‌కు రోజుకు 10 లారీల సరకు వచ్చేది కాగా, ఇప్పుడు 2, 3 లారీలకు పరిమితమైంది. మార్కాపురం స్థానిక మార్కెట్లకు వెళ్తున్న రెండోరకం నిమ్మకు రూ.5లకు మించి లేదు. దీంతో కోతలు ఆగిపోయాయి. అకాల వర్షంతో ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News May 27, 2024

JSP Vs YCP ‘నేమ్ ప్లేట్ల’ ట్రెండ్.. ఎవరూ తగ్గట్లేగా..!

image

ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 27, 2024

పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్ల’ ట్రెండ్.. ఎవరూ తగ్గట్లేగా..!

image

ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 27, 2024

కొత్తపల్లి మండల వాసికి డాక్టరేట్

image

కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మజార గ్రామమైన సింగరాజుపల్లి వాసికి శనివారం డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రామానికి చెందిన నక్క సత్యాలు, యేసురత్న దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ విజయవాడలోని వీఐటీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు ప్రవీణ్ కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం చేశారు. దీంతో పలువురు అభినందించారు.

News May 27, 2024

ముద్దనూరు: భార్యపై అనుమానం.. భర్త సూసైడ్

image

ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో ఓబులేసు (41) అనే వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఆంజనేయులు సమాచారం మేరకు.. ఓబులేసుకు 20 ఏళ్ల కిందట ఉప్పలూరుకు చెందిన కేశమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్య కేశమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకుని మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓబులేసు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 27, 2024

ఎన్నికల్లో అల్లర్లు చేసిన వారిపై రౌడీ షీట్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన ఘటనలను ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా పరిగణించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. తాడిపత్రిలో 106 మంది, యాడికిలో 37 మంది, పెద్దవడుగూరులో ఏడుగురు, ఇతర ప్రాంతాల్లో 9 మంది కలిపి మొత్తం 159 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అల్లర్లు, గొడవలు, ఘర్షణలకు దిగేవారికి ఇది పెద్ద గుణపాఠం అని హెచ్చరించారు.

News May 27, 2024

రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

image

రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు. దాడిలో గాయపడిన చేరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వరరెడ్డి, చేరెడ్డి రఘురామిరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

News May 27, 2024

పైడితల్లమ్మ దర్శనం టికెట్ ధర పెంపు

image

విజయనగరం పైడితల్లి అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్‌ను ఇటీవల రూ.25 నుంచి రూ.50కు పెంచారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేటు వ్యక్తులు గర్భాలయం పూజలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆలయ అధికారులు కొట్టిపారేశారు. అలా ఏం జరగడం లేదని తేల్చి చెప్పారు.

News May 27, 2024

నేటి నుంచి పాలీసెట్‌ కౌన్సిలింగ్‌

image

పాలీసెట్‌ కౌన్సిలింగ్‌‌ను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జయచంద్రా రెడ్డి తెలిపారు. నేడు 1 నుంచి 12,000 ర్యాంకు వరకు, 28న 12,001 నుంచి 27,000 వరకు, 29న 27,001 నుంచి 43,000 వరకు, 30న 43,001 నుంచి 59,000 ర్యాంకు వరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 27, 2024

విశాఖ: ఉష్ణోగ్రత పెరిగే అవకాశం

image

సముద్ర తీరానికి సమీపంలో ఉన్నా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పద్మనాభం ప్రాంతంలో 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం అనకాపల్లి జిల్లాలో 14, అల్లూరిలోని 10 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో 42 మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.