India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. నిర్దేశించిన సమయానికి అందరూ తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు.

లింగాల మండలం ఇప్పట్ల గ్రామం దగ్గర పులివెందుల వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఆదివారం ఢీకొని ఒకరు మృతి చందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సింహాద్రిపురం మండలం బిదినంచెర్లను చెందిన నారాయణరెడ్డిగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి లింగాల మండలం బోనాలకు చెందిన రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

పల్నాడు జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో సత్తెనపల్లి మీదగా వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్‌లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు కాజీపేట, విజయవాడ మీదుగా గమ్య స్థలానికి వెళ్తాయన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరమ్మతు పనులు వేగవంతం చేశామని చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో పాలిటెక్నిక్ సీట్ల భర్తీకై నిర్వహించే వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ రేపు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి జూన్ 3వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని సంబంధిత వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, SRR కాలేజీ, ఆంధ్రా లయోలా కళాశాలలో వెబ్ కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు గెలవాలని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రత్యేకపూజలు చేయించారు. ప.గో. జిల్లా నరసాపురం మండలం LB.చర్ల గ్రామానికి చెందిన జనసైనికుడు కటకంశెట్టి సంజీవరావు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో పవన్‌కళ్యాణ్, నాయకర్ చిత్రపటాలతో కూర్చొని ప్రత్యేక పూజలు చేయించారు.

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఎస్పీతో చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గానీ, అతని అనుచరులకు గానీ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిపై కేసులు పెట్టవద్దని ఎస్పీని కోరారు. వెంకట్రామిరెడ్డి కేవలం తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు.

మరో 8 రోజుల్లో APకి కాబోయే CM ఎవరో తేలిపోనుంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని YCP నాయకులు డేట్, టైం ఫిక్స్ చేశారు. అటు TDP నాయకులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో జూన్ 8,9 తేదీల్లో విశాఖలోని హోటల్ రూములన్నీ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఏపీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు భావిస్తున్నారు.

మాచర్ల పట్టణంలో మహిళపై ఆదివారం ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. 22వ వార్డుకు చెందిన నీలావతి అనే మహిళపై వెంకటేశ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడని బాధితురాలి బంధువులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి వీధుల్లో కత్తితో వీరంగం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆదివారం ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి టికెట్ల రూపంలో రూ.9,06,700, పూజలు, విరాళాల రూపంలో రూ.83,523, ప్రసాదాల ద్వారా రూ.3,82,840 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్‌లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గాని, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేదన్నారు.
Sorry, no posts matched your criteria.