Andhra Pradesh

News May 26, 2024

నార్పల: రైతుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

నార్పల మండలం జంగమరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో రైతుల మధ్య ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందారు. అతడు ఇటీవల నూతన బోరు వేయించాడు. మోటార్ ఆమర్చడానికి వెళ్లిన సమయంలో తుంపెర గ్రామస్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కిందపడగా వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News May 26, 2024

శ్రీకాకుళం: ర్యాంకుల వారీగా పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జిల్లాలో రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. మే 27 తేదీన 1 నుంచి 12 వేల లోపు, 28 తేదీన 12,001 నుంచి 27 వేల లోపు, 29 తేదీన 27,001 నుంచి 43 వేలు లోపు, 30 తేదీన 43,001 నుంచి 59 వేల లోపు, 31 తేదీన 59,001 నుంచి 75 వేలు, జూన్‌ 1 తేదీన 75,001 నుంచి 92,000 వరకు, 2 తేదీన 92,001 నుంచి 1,08,000 వరకు, జూన్ 3 తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరుకావాలి.

News May 26, 2024

విశాఖ: ఏయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరో సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. 27,603 మంది విద్యార్థులు ఆరో సెమిస్టర్‌కు హాజరు కాగా 27,483 మంది ఉత్తీర్ణులైనట్లు ఏయూ డిగ్రీ కళాశాల ఎగ్జామినేషన్ డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. 99.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏయూ వెబ్ సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.

News May 26, 2024

చీరాల: రైలు ప్రమాదం.. రెండు చేతులు కోల్పోయిన యువకుడు

image

చీరాల పట్టణ పరిధిలో పేరాలకు చెందిన వడ్డె నాగేశ్వరరావు బజారుకు చెందిన ఈశ్వరరావు తన రెండు చేతులు పోగొట్టుకున్నాడు. ర్వైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజాము సమయంలో కారంచేడు రైలు గేటు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు చేతులు కోల్పోయాడు. స్థానికులు 108లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 26, 2024

వాకాడులో రోడ్డు ప్రమాదం

image

వాకాడు మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News May 26, 2024

శ్రీకాకుళం: ఏయూ డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డివిఆర్ మూర్తి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ డిగ్రీ 6 సెమిస్టర్ పరీక్షల మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవ్వగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారని 99.57 శాతం ఉత్తీర్ణత నమోదైందని అన్నారు.

News May 26, 2024

కృష్ణా: డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

దూరవిద్యా విధానంలో డిప్లొమా ఇన్ అపారెల్ మర్చండైజింగ్‌ కోర్సులో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్శిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఇగ్నో వర్గాలు సూచించాయి. 

News May 26, 2024

అనంత: సప్లిమెంటరీ పరీక్షలకు 90శాతం విద్యార్థులు గైర్హాజరు..!

image

అనంత జిల్లాలో 10వ తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 90శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షలు విభాగం ఏ.సి. గోవింద నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 సెంటర్లలో హిందీ పరీక్షకు 1680 మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 170 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి తనిఖీ చేశారు.

News May 26, 2024

అనంత:చీనీకాయలు టన్ను రూ.36 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.36 వేలు, కనిష్ఠంగా రూ.15వేలు, సరాసరి రూ.23 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం మార్కెట్‌కు శనివారం మొత్తంగా 525 టన్నుల చీనీకాయలు వచ్చాయని ఆమె వెల్లడించారు.

News May 26, 2024

బేతంచెర్ల: పాత కక్షలతో దాడి.. వ్యక్తి మృతి

image

మండల పరధిలోని రుద్రవరంలో పాత కక్షలతో గొడవ పడి కట్టెలతో శనివారం రాత్రి కొట్టుకున్నారు. ఈ గొడవల్లో హరిప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిప్రసాద్ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.