India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆకుల నందిగాం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం టెక్కలి నుంచి పలాస బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లగేజీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

రొళ్ల మండల పరిధిలోని బంద్రేపల్లి గొల్లహట్టి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున శివన్న మేకల మంద పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేక, రెండు పెంపుడు కుక్కలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మేక మృతితో 8 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని షార్ నుంచి మే 28న అగ్నిబాణ్ సార్టెడ్ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఉదయం 5.45 గంటలకు షార్‌లోని ప్రైవేటు లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించారు. సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌తో ఈ రాకెట్ పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.

కమలాపురం చెరువు కట్టపై వెలసిన వజ్రాల సుంకులమ్మ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన పాల పళ్ల విభాగం ఎద్దులచే బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు ప్రథమ బహుమతి రూ.60 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలా వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వ్యాపారులు హానికర రంగులు, కెమికల్స్‌తో కూల్ డ్రింక్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెంలోని రామన్నగూడెం, మండవల్లిలోని లోకుమూడి, పాలకొల్లులో ఈనెల 21-24 వరకు జరిగిన విజిలెన్స్ తనిఖీల్లో ఈ గుట్టురట్టయ్యింది. అనుమతులు లేకుండా కొందరు.. గడువు తీరిన, హానికర రసాయనాలతో డ్రింక్స్ తయారు చేస్తూ ఇంకొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

అర్ధరాత్రి ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల పెద్ద నాగేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తి చేతబట్టి నలుగురిపై దాడి చేశాడు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే సుగుణమ్మ(54) ఇంటి ముందు మంచంపై నిద్రిస్తుండగా భర్త అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. సీఐ గోపీనాథ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

టెక్కలిలో జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక బాలికోన్నత పాఠశాలలో జరిగిన హిందీ పరీక్షకు టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, మెలియాపుట్టి మండలాల నుంచి 57 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 52 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో 5మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించగా ఒక్కోక్కరికి ఒక్కో రూమ్ కేటాయించారు. వీరి కోసం మొత్తం 9 మంది విధులు నిర్వహించారు.

‘పది’ సప్లిమెంటరీ హిందీ పరీక్షలో భాగంగా శనివారం తూ.గో జిల్లా కొవ్వూరు పరిధిలో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాలకు 80 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే వచ్చారు. PMMM స్కూల్‌లో 25 మందికి గానూ 1, ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 31 మందికి 1, బాలికోన్నత పాఠశాలలో 24 మందికి ఒకరు పరీక్ష రాశారు. ఈ ముగ్గురి కోసం 20 మంది టీచర్లు విధులు నిర్వహించారు.

బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్ క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కూలీలు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట వండుతుండగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దేవరాజ్ (2), వనిత (30), సాయినాధ్ (27), లక్ష్మీబాయి (20)లకు తీవ్ర గాయాలవ్వగా.. నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.
Sorry, no posts matched your criteria.