India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొల్లేరు సరస్సులోని ఆటపాక పక్షుల కేంద్రంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వారం రోజులుగా బోటు షికారు నిలిచిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బోటు షికారు లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆటపాక పక్షుల కేంద్రానికి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం సరస్సులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో కళావిహీనంగా మారింది.

కేవిబిపురం మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కర్లపూడి గ్రామానికి చెందిన జావిద్ బేగ్(19) ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి బైక్‌పై శ్రీకాళహస్తికి బయలు దేరిన జావిద్.. కర్లపూడి దాటిన తరువాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాయిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ లోకనాథం తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్ని రాజు, ఆయన ఇద్దరు అనుచరులపై సంతకవిటి పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. ఇద్దరు మైనర్లను బెదిరించి, జైలులో పెడతామని భయపెట్టి చేతులతో కొట్టిన ఘటనలో బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకవిటి ఎస్ఐ షేక్ శంకర్ కేసు నమోదు చేశారు. ఎన్ని రాజుతోపాటు ఆయన అనుచరులు మీసం శ్రవణ్, తూముల యోగేంద్ర పై కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.

సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరిరావుకు చెందిన కారు దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. ఒంగోలులోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితులు కనసాని ఈశ్వర్ రెడ్డి, పాలెటి అభిషేక్, గోపాలుడని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకూ శారీరక విభిన్న ప్రతిభావంతులైన బాలబాలికలు వసతి గృహాల్లో ఉండటానికి దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎస్.అబ్దుల్ రసూల్ తెలిపారు. 100 బాలురకు, 50 మంది బాలికలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో 52,781 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. విత్తనకాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రకారం 46,588 క్వింటాళ్లు అవసరం అవుతాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి 37,889 క్వింటాళ్ల విత్తనకాయలను ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే విత్తన పంపిణీ సైతం చేస్తున్నామని తెలిపారు.

విజయనగరం ఎస్పీ ఎం.దీపిక శనివారం లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల తదనంతరం భద్రపరచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల కమీషన్ మార్గనిర్దేశకాల ప్రకారం సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శనివారం అనంతపురంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.

ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఎస్పీ జీ.ఆర్.రాధిక శనివారం రాత్రి సందర్శించి, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం గార్డు సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.

ఈనెల 4న రాయలసీమ యూనివర్సిటీలో జరుగునున్న ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన, ఎస్పీ కృష్ణకాంత్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో చర్చించారు. కౌంటింగ్ నిర్వహణలో, భద్రతలో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.