India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను, భధ్రతా చర్యలను కలెక్టర్ పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 2,370 మంది అభ్యర్థులకు గాను 1434 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 936 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 61% గా నమోదైందన్నారు.

జూన్ 4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శెట్టి బలిజ హరిప్రసాద్(30)గా గుర్తించామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన పొట్నూరు హారిక జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీఎస్సీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హారిక 9.7 గ్రేడ్ పాయింట్స్ సాధించి జిల్లా టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హారిక జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో కుటుంబ సభ్యులు, పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 3,422 మంది హాజరు కావాల్సి ఉండగా 176 మంది గైర్హాజరై 3,246 మంది పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 926 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది గైర్హాజరై 846 మంది పరీక్ష రాశారని వారు పేర్కొన్నారు.

రాజంపేట ఆకులవీధిలోని నివాసం ఉంటున్న రామాయణం అంజి శుక్రవారం రాత్రి మిద్దె పైనుంచి పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

చిలకలూరిపేట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మద్దిరాల గ్రామంలోని ఓగేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గ్రామానికి చెందిన పరిచూరి శ్రీనివాసరావు(50), వరగాని వెంకట్రావు(40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1000 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. మూడంచెల భద్రత, కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. కనుపర్తిపాడులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది.
జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
Sorry, no posts matched your criteria.