Andhra Pradesh

News September 23, 2025

కర్నూలు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

image

కర్నూలు రైల్వే స్టేషన్‌లో టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగుల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాలు ఉన్నాయా అని స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి డ్రగ్స్ అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు.

News September 23, 2025

అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News September 23, 2025

ఎచ్చెర్ల: ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆందోళన చెందవద్దు

image

ఫీజు రియంబర్స్మెంట్ పై కళాశాలల యజమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా సాంఘిక సంక్షేమ సంచాలకులు మధుసూదన్ రావు అన్నారు. ఈ మేరకు అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్‌తో, ఎచ్చెర్ల‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సోమవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు విడతల వారిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు త్వరలో చెల్లింపునకు, రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన ఆయన పేర్కొన్నారు.

News September 23, 2025

ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదు: కమిషనర్

image

ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. నగర ప్రజల ఆరోగ్యం, భద్రత సౌకర్యం కోసం దీన్ని ప్రారంభించామన్నారు. వీధి వ్యాపారులకు క్రమబద్ధమైన జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ద్వారా వారికి ఆదాయం పొందే అవకాశం కల్పిస్తామన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వివరించారు.

News September 23, 2025

VZM: శ్రీ పైడితల్లిని దర్శించుకున్న ఎస్పీ

image

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.ఆర్.దామోదర్ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ అధికారులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మూడు లాంతర్లను సందర్శించి సిరిమాను తిరిగే ప్రాంతాన్ని పరిశీలించారు.

News September 23, 2025

రాజమండ్రి: నేరాల కట్టడికి డ్రోన్‌తో నిఘా

image

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి వినియోగం వంటి నేరాలను కట్టడి చేయడానికి జిల్లావ్యాప్తంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఈ ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సోమవారం పోలీసులు తెలిపారు.

News September 23, 2025

ఈ గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు అవార్డ్స్

image

విశాఖలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అవార్డులను అందజేశారు.
గోల్డ్ అవార్డు : రోహిణి పంచాయితీ, Dhule జిల్లా, మహారాష్ట్ర
సిల్వర్ అవార్డు : West Majlishpur పంచాయతీ, వెస్ట్ త్రిపుర, త్రిపుర
జ్యారీ అవార్డు: 1.Suakati పంచాయతీ, Kendujhar జిల్లా, ఒరిస్సా
2.Palsana పంచాయితీ, సూరత్ జిల్లా, గుజరాత్
సర్పంచులు అవార్డులను స్వీకరించారు.

News September 23, 2025

శ్రీకాకుళం: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

image

✦ DSCలో ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ ముఖ్య సూచనలు
✦రాష్ట్ర పండుగ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధం
✦నందిగాం: ఈఎంఐ కట్టలేదని ఇంటికి తాళం వేశారు
✦శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీలు
✦జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
✦ గుంతలమయంగా మారిన కొత్తపేట జంక్షన్ రోడ్డు

News September 22, 2025

టంగుటూరు వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వెళ్తున్న బైక్‌- లారీ ఢీకొన్నాయి. టంగుటూరి SI నాగమల్లేశ్వరరావు గాయాలైనవారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. మృతులు పుల్లారెడ్డిపాలెంకి చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, వెంకటాయపాలెంకి చెందిన చొప్పర శ్రీనుగా గుర్తించారు.

News September 22, 2025

భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం: CM

image

గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి భూ పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని CM పేర్కొన్నారు.